Hyundai Alcazar : మీ ఫ్యామిలీ కోసం 7-సీట్ల SUV కారు కొనేందుకు చూస్తున్నారా? హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఆగస్టులో ప్రీమియం అల్కాజార్ SUV కారుపై ఏకంగా రూ.70వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు గతంలో కన్నా సరసమైన ధరకే ఈ SUV కారును సొంత చేసుకోవచ్చు. అలాగే, కంపెనీ ఈ కారుపై రూ.20వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.40వేలు స్క్రాపేజ్ బోనస్, రూ.10వేలు అదనపు బోనస్‌ను అందిస్తోంది.
కస్టమర్ ఈ ఆఫర్ బెనిఫిట్స్ ఆగస్టు 31, 2025 వరకు మాత్రమే పొందవచ్చు. అదే సమయంలో, కొత్త అల్కాజార్‌లో టెక్నాలజీపరంగా కంపెనీ ఫీచర్లను చేర్చింది. SUV కొన్ని వేరియంట్లలో ఎక్స్‌టెండెడ్ సపోర్టు కూడా అందిస్తోంది. ఇప్పుడు SUV కారు ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Hyundai Alcazar : ఎంత డిస్కౌంట్ వస్తుందంటే? :
ఆగస్టు 2025లో హ్యుందాయ్ అల్కాజార్‌పై మొత్తం రూ.70వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.20వేలు క్యాష్ డిస్కౌంట్, రూ.40వేలు స్క్రాపేజ్ బోనస్, రూ.10వేలు అదనపు బోనస్ పొందవచ్చు. ఈ ఆఫర్ 31 ఆగస్టు 2025 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ SUV ఎక్స్-షోరూమ్ ధర రూ.14,99,000 నుంచి ప్రారంభమై రూ.21,73,700 వరకు ఉంటుంది.
హ్యుందాయ్ పాపులర్ SUV అల్కాజార్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇందులో అనేక స్మార్ట్, అధునాతన ఫీచర్లు ఉన్నాయి. అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ డిజిటల్ కీ సిస్టమ్ కలిగి ఉంది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్ నుంచి కారును లాక్ చేయవచ్చు.
అవసరమైతే అన్‌లాక్ చేయవచ్చు. స్టార్ట్ చేయవచ్చు లేదా ఆఫ్ చేయవచ్చు. ఈ ఫీచర్ హ్యుందాయ్ బ్లూలింక్ యాప్ ద్వారా పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురు వినియోగదారులకు 7 డివైజ్‌లకు కనెక్ట్ చేసేందుకు సపోర్టు ఇస్తుంది.
Hyundai Alcazar : టెక్నాలజీ, ఫీచర్లు :
కొత్త అల్కాజార్‌లో కంపెనీ టెక్నాలజీపరంగా క్రెటాలో లేని రెండో వరుస ప్రయాణీకులకు ఇప్పుడు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అందిస్తోంది. అలాగే, ప్రయాణీకులందరికి తమ ఫోన్లను ఛార్జ్ చేసేందుకు రెండో మూడో వరుసలలో USB-C పోర్ట్‌లు ఉన్నాయి.
టాప్-స్పెక్ సిగ్నేచర్ వేరియంట్‌లో రెండో వరుసలో వెంటిలేటెడ్ కెప్టెన్ సీట్లు కూడా ఉన్నాయి. సుదూర ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. కొన్ని వేరియంట్లలో ఎక్స్ టెండెడ్ సపోర్టు కూడా ఉంది. ప్రయాణీకులకు తక్కువ అలసట ఉంటుంది.
డ్రైవర్, కో-ప్యాసింజర్ సీట్లు ఇప్పుడు 8-వే ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్‌తో వస్తున్నాయి. ప్రతి వ్యక్తి వారి సౌలభ్యం ప్రకారం సీటు సెట్ చేసుకునేలా వీలు కల్పిస్తుంది. డ్రైవర్ సీటులో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. సీటును మళ్లీ మళ్లీ సెట్ చేయడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. ప్రెస్టీజ్ వేరియంట్ 6-సీట్ల మోడల్‌లో ముందు సీట్లను కేవలం ఒక బటన్‌ను నొక్కడం ద్వారా మూవ్ చేయొచ్చు. బ్యాక్ సీటు ప్రయాణీకులకు సౌలభ్యంతో పాటు ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది.