7th Pay Commission : 7వ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగుల ప్రత్యేక వర్గానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వారికి ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ రెట్టింపు చేసింది. ఈ ప్రయోజనం ఏయే ఉద్యోగులకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
కేంద్ర ప్రభుత్వం వికలాంగులైన ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ప్రకటించింది. ఇప్పుడు ప్రత్యేక కేటగిరీ వికలాంగులైన ఉద్యోగులకు సాధారణ రేటు కన్నా రెట్టింపు ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ అందిస్తుంది. ఈ విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సూచనలు జారీ చేసింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంలో డబుల్ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ పొందడానికి దివ్యాంగ వర్గాల జాబితాను అప్‌డేట్ చేశారు. ఈ సవరణ 15 సెప్టెంబర్ 2022 నాటి మునుపటి సూచనలు చేసింది.
7th Pay Commission : ఏ ఉద్యోగులకు ప్రయోజనమంటే? :
నోటిఫికేషన్ ప్రకారం.. వికలాంగుల హక్కుల చట్టం (RPwD) 2016 వికలాంగుల సాధికారత శాఖ (EPwD)లో నిర్వచించిన ఈ కింది పేర్కొన్న వర్గాలకు చెందిన ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని పొందేందుకు అర్హులు.
Read Also : Jr NTR : నన్ను క్షమించాలి.. జూ.ఎన్టీఆర్ వీడియో రిలీజ్.. వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్..!
అంధత్వం :
చలనశీల వైకల్యం. సెరిబ్రల్ పాల్సీ, కుష్టు వ్యాధి నయం, మరుగుజ్జుత్వం, యాసిడ్ దాడి బాధితులు, కండరాల బలహీనత, వెన్నెముక వైకల్యం మొదలైనవి ఉన్నాయి.
- చెవిటి, మూగ, వినికిడి లోపం ఉన్నవారు
- ఆటిజం స్పెక్ట్రం రుగ్మత లేదా మేధో వైకల్యం
- మల్టిపుల్ స్క్లెరోసిస్, పార్కిన్సన్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు
- హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి వంటి రక్త రుగ్మతలు
7th Pay Commission : చెవిటి-అంధత్వంతో సహా వైకల్యాలు :
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వికలాంగులైన ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. ప్రయాణం వంటి రోజువారీ సవాళ్లలో ఈ ఆర్థిక సాయం వారికి అందిస్తుంది.
7వ వేతన సంఘం కింద అలవెన్సులివే :
కేంద్ర ఉద్యోగులు ప్రస్తుతం 7వ వేతన సంఘం నిర్మాణం కింద జీతం, భత్యాలను పొందవచ్చు. ఇందులో కరవు భత్యం (DA), ఇంటి అద్దె భత్యం (HRA), ప్రయాణ భత్యం, పిల్లల విద్య భత్యం, హాస్టల్ సబ్సిడీ మొదలైనవి ఉన్నాయి. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉద్యోగుల జీతం, భత్యాలలో భారీ మార్పు ఉండవచ్చు.
వికలాంగులైన ఉద్యోగులు ఇప్పటికే కొన్ని అదనపు సౌకర్యాలను పొందుతున్నారు. అయితే, ఈ ట్రాన్స్‌ఫోర్ట్ అలవెన్స్ పెరుగుదల వారికి మరింత సౌలభ్యం, స్వావలంబనను అందించడంలో సాయపడుతుంది.