...

భారీగా రేట్లు తగ్గించిన టాటా మోటార్స్.. ఎంతంటే.?

టాటా మోటార్స్ కస్టమర్లను ఆఫర్లతో ముంచెత్తుతోంది. అమ్మకాలను పెంచేందుకు టాటా డీలర్ షిప్ లు పలు మోడల్స్ కు భారీ తగ్గింపు ధరలను ఇస్తున్నాయి. నెక్సాన్,టిగోర్ మొదలుకొని సఫారీ వంటి ఎస్ యూవిల వరకు చాలా మోడల్స్ పై డీల్స్ ఉన్నాయని టాటా ప్రకటించింది. టాటా ఆల్ట్రుజ్ కొనుగోలుపై పది వేల రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. ఆల్ట్రుజ్ డీజిల్ వెర్షన్ కు పదివేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. పెట్రోల్ వేరియంట్ కు ఏడు వేల ఐదు వందల రూపాయల విలువైన డిస్కౌంట్ పొందవచ్చు.

టాటా సఫారీ పై 2021 మోడల్ కు 60 వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ బోనస్,డిస్కౌంట్ పొందవచ్చు.అయితే 2022 మోడల్ కు 40 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తారు. 2021 టాటా హారియర్ మోడల్ కు 25 వేల రూపాయల వరకు విలువైన కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 2021 మోడల్ కు 60వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. 2022 మోడల్ కు 40 వేల రూపాయల ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తారు.

టిగోర్, టియాగో పై వరుసగా పది వేల రూపాయలు, 5 వేల రూపాయల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది. ఇతర రాయితీలను కూడా ఉపయోగించుకోవచ్చు. టాటా నెక్సన్ హ్యాచ్ బ్యాక్ డీజిల్ వేరియంట్ తో కారును మార్చుకుంటే 15 వేల రూపాయల వరకు బోనస్ పొందవచ్చు. పెట్రోల్, డీజిల్ వేరియంట్ లపై వరుసగా ఐదు వేల రూపాయలు, పది వేల రూపాయల విలువైన కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.