SBI offers : దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. ఎస్బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ పేరుతో బంపర్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. పలు ట్రాన్సాక్షన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఏయే వాటిపైన ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఐటీసీ స్టోర్ పై తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంచింది ఎస్బీఐ.
ఫ్లాట్ 20 శాతం తగ్గింపును అందిస్తూ.. అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్ల లిమిట్ కూడా ఉంది. అది అందరూ గమనించాలి. అంటే 799 లేదా ఆపైన విలువ కల్గి ఆర్డర్లకు మాత్రమే డిస్కౌంట్ వర్తిస్తుంద. దీనికి యోనో 202922 కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. మేక్ మై ట్రిప్ ద్వారా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.
ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. హోటల్ బుకింగ్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. అలాగే టాటా క్లిక్ లో కూడా ఆఫర్లు ఉన్నాయి. జీవైఎఫ్టీఆర్ లో భారీ తగ్గింపు లభిస్తుంది. విమాన ప్రయాణాలపై 15 శాతం రాయితీ కల్పిస్తోంది. క్లియర్ ట్రిప్ ద్వారా 20 శాతం వరకు ఆఫర్ పొందవచ్చు.
Read Also : SBI : ఎస్బీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రెండు వారాల్లోనూ బ్యాంకు సేవలు?