Jio Offer: దేశీయ టెలికాం దిగ్గజం సమస్త జియో తమ వినియోగదారులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ బోనాంజ కేటగిరి కింద జియో కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. ఈ ప్లాన్ లో భాగంగా జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తో వినియోగదారులు నెలకు 100 నుంచి 200 రూపాయలు అదనంగా చెల్లించడం వల్ల ఏకంగా 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఈ వెసులుబాటు మార్చి 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
జీరో ఇన్‌స్టలేషన్ ఛార్జీతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ వినియోగించుకునే వారికి జియో ఫైబర్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇన్‌స్టలేషన్ చేయించుకున్న యూజర్లకు ఇంటర్నెట్ బాక్స్, సెట్ టాప్ బాక్స్ పొందవచ్చు. ఫైబర్ పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు నెలకు 30ఎంబీపీఎస్ స్పీడ్‌తో రూ. 399తో అపరిమిత హై స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. ఈ క్రమంలోనే నెలకు వంద రూపాయలు అదనంగా చెల్లిస్తే 6, 200 చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
మనం చెల్లించే ప్లాన్ బట్టి మనకు ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు అదనంగా వంద, 200 రూపాయలు చెల్లించడంతో
14 ఓటీటీ యాప్స్ సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం తోపాటు అదనంగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ బేసిక్ సబ్ స్క్రిప్షన్ వినియోగించుకోవచ్చు. మొత్తానికి జియో వినియోగదారులకు ఎంటర్టైన్మెంట్ బోనాంజ కేటగిరి కింద అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు.