Flipkart Sell Back Offer : కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఫ్లిప్‌కార్ట్‌… కొత్తగా సెల్‌బ్యాక్‌ ప్రోగ్రాం !

Flipkart Sell Back Offer : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వస్తుంది. రకరకాల ఆఫర్లను ప్రవేశపెడుతూ కొత్త కస్టమర్లకు వల వేస్తుంది. ఇప్పుడు తాజాగా ఫ్లిప్‌కార్ట్‌ సెల్ బ్యాక్ ప్రోగ్రాంను ప్రకటించింది. దీని ద్వారా వినియోగదారులు వారు ఉపయోగించిన పాత స్మార్ట్‌ఫోన్‌ లను విక్రయించేందుకు అవకాశం ఉంటుంది. కొత్త ప్రోగ్రామ్ మొదట్లో స్మార్ట్‌ఫోన్‌లతో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొత్త సెల్ బ్యాక్ ప్రోగ్రామ్ ప్రధానంగా ఇండియా లోని ప్రధాన నగరాల్లో 1,700 వరకు పిన్ కోడ్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ సెల్‌ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించింది.

సెల్‌ బ్యాక్‌లో భాగంగా కస్టమర్లు ఏ మొబైల్‌ అయినా అమ్మవచ్చు. వేరే చోటు కొనుగోలు చేసిన ఫోన్‌ను కూడా ఫ్లిప్‌కార్టులో అమ్మవచ్చు. ప్రస్తుతం మొబైల్‌లకే మాత్రమే ఈ సదుపాయం ఉంది. త్వరలో ఇతర కేటగిరిలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని ఫ్లిప్‌ కార్ట్‌ చెబుతోంది. ఈ విధానం ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌, పాట్నా నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా 1700 పిన్‌ కోడ్స్‌లలో ప్రస్తుతం ఈ సెల్‌ బ్యాక్‌ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఆ ప్రోగ్రాం వివరాలు మీకోసం…

Advertisement

ఫోన్‌ ని విక్రయించే పద్దతులు :

Advertisement
  • ముందుగా మీ ఫోన్‌లలో ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ ఓపెన్‌ చేయాలి.
  • యాప్‌ కింది భాగంలో ఉన్న బాటమ్‌బార్‌లో మెనూపై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత సెల్‌బ్యాక్‌ (Sell Back) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • అక్కడున్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి కన్ఫార్మ్‌ చేయాలి.
  • 48 గంటలలోపు ఫ్లిప్‌కార్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ మీ ఇంటివద్దకు వచ్చి ఫోన్‌ను తీసుకుంటారు.
  • వెరిఫికేషన్‌ పూర్తయిన తర్వాత కొన్ని గంటల్లోనే ఫోన్‌ వాల్యూ ఎంత ఉందో ఆ మొత్తంలో కూడిన ఓచర్‌ కస్టమర్లకు జారీ అవుతుంది.
  • ఫోన్‌ను విక్రయించే ముందు దీని ధర ఎంత ఉంటుందనేది ముందుగానే అంచనా వేసుకోవడం ముఖ్యం.