...

Facebook: ఈ నెలాఖరు నుంచి ఈ రెండూ ఫీచర్లు తొలగిస్తున్న ఫేస్ బుక్..!

Facebook: ప్రముఖ సోషియల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఎన్నో కొత్త కొత్త ఫీచర్లు తన యూజర్ల కొసం అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో ఫేస్బుక్ లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఉపయోగించాలి అంటే యూజర్ల లొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఫేస్బుక్ యూజర్లు వారి లొకేషన్ యాడ్ చేస్తే తప్ప అందులో యాడ్స్ యాక్సెస్ చేయడానికి, దగ్గర లోని ఫ్రెండ్స్‌ ను కనుగొనడానికి ఫేస్‌బుక్ అనుమతిస్తుంది. లొకేషన్ యాడ్ చేయకపోతే ఆ ఫీచర్స్ యాక్సెస్ చేయటానికి వీలు పడదు. అంతేకాకుండా వాతావరణం యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి , నియర్ బై ఫ్రెండ్స్ గురించి తెలుసుకోవటానికి కూడా మన లొకేషన్ ను యాక్సిస్ చేయడం తప్పనిసరి.

అయితే ఫేస్ బుక్ లోని రెండు రకాలు ఫీచర్స్ నిలిపివేస్తున్నట్లు ఒక ప్రకటనలో ఫేస్ బుక్ యాజమాన్యం ప్రకటించింది. ఫేస్ బుక్ లోని వెదర్ అలర్ట్, నియర్ బై ఫ్రెండ్స్ వంటి ఫీచర్స్ ఈ నెలాఖరు నుండి నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ యాజమాన్యం తెలియ చేసింది.అంటే మే 31, 2022 తర్వాత నియర్ బై ఫ్రెండ్స్, వెదర్ అలర్ట్స్ అనే ఈ రెండు ఫీచర్లు మనకి అందుబాటులో ఉండవు .

అందువల్ల ఫేస్ బుక్ లోని ఈ రెండు టీచర్స్ ఉపయోగించడానికి ఇకమీదట లొకేషన్ యాక్సెస్ చేయమని అడగదు. అయితే ఫేస్‌బుక్ ఈ ఫీచర్‌ల కోసం మాత్రమే లొకేషన్ యాక్సెస్‌ను నిలిపివేస్తుంది. మిగిలిన ఫీచర్స్ కోసం ఎప్పటిలాగే లోకేషన్ యాక్సెస్ చేయవలసి ఉంటుంది . అంతేకానీ ఫేస్బుక్ లొకేషన్ డేటాను సేకరించడం పూర్తిగా ఆపివేయదు. ఇదిలా ఉండగా గూగుల్ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా లొకేషన్ యాక్సెస్ అడిగే యాప్ లను తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం.