CIBIL Score : బ్యాంకు నుండి పర్సనల్ లోన్ కావాలన్నా, కారు, గృహ రుణాలు కావాలన్నా, క్రెడిట్ కార్డులు కావాలన్నా… ఇప్పుడు ప్రతి బ్యాంకు చూసేది సిబిల్ స్కోర్. బ్యాంకుకు లోన్ కావాలని వెళ్తే మొదట చూసేది సిబిల్ స్కోరే. ఈ సిబిల్ స్కోర్ ఆధారంగా మీకు లోన్ ఇచ్చేది.. లేనిది నిర్థారిస్తారు. ఒక వేళ ఈ స్కోర్ తక్కువగా ఉన్నట్లైతే మీకు లోన్ రావడం అంత సులభం కాదు. ఒకవేళ సిబిల్ స్కోర్ బాగుంటే.. బ్యాంకులే మీ వెంట పడతాయి లోన్లు ఇస్తాం.. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతాం.. పే లేటర్ అనే సదుపాయాలు కల్పిస్తాం అని ఫోన్లు, మెసేజీలు చేస్తుంటాయి.
ఈ సిబిల్ స్కోర్ అనేది మీరెప్పుడైనా లోన్ తీసుకుంటే అప్పటి నుండి మీ పేరుపై ఈ స్కోర్ వస్తుంది. తీసుకున్న లోన్ సక్రమంగా కడుతూ పోతే స్కోర్ పెరుగుతుంది. ఒక్క నెల కట్టకపోయినా.. ఒక్క రోజు ఆలస్యం అయినా అది స్కోర్ పై పెద్ద దప్రభావమే చూపుతుంది. తిరిగి ఆ స్కోర్ సక్రమంగా రావడానికి మూడు నుండి నాలుగు నెలల టైం పడుతుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది కనీసం 750 ఉండాలని చెబుతాయి బ్యాంకులు. ఆపైన స్కోరు ఉన్న వారికే లోన్లు ఇస్తాయి.
భారత దేశంలో 2007 నుండి ఈ సిబిల్ స్కోర్ అనేది ప్రవేశ పెట్టారు. ట్రాన్స్ యూనియన్ సిబిల్.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకున్న వారికి సిబిల్ స్కోర్ ను ఇస్తుంది. దీనిని క్రెడిట్ స్కోర్ అని కూడా పిలుస్తారు. చిన్న పాటి లోన్ తీసుకున్నా… దానిని క్రమంగా కడుతూ పోతే సిబిల్ స్కోరు దానంతంట అదే పెరుగుతుంది. మీ పేరుపై ఎలాంటి రుణాలు ఉన్నా, కారు, గృహ లోన్లు ఉన్నా, క్రెడిట్ కార్డు ఉన్నా.. ఈ స్కోర్ జనరేట్ అవుతుంది. ఇందులో మీకు సంబంధించిన సమస్త సమాచారం ఉంటుంది. మీరు తీసుకున్న రుణాలు ఎన్ని.. ఏయే రుణాలు తీసుకున్నారు.. ఎప్పుడు తీసుకున్నారు.. వాటిని సక్రమంగా కడుతున్నారా లేదా.. అనే అంశాలన్నీ రికార్డు అవుతుంటాయి.
Read Also : Darja Movie Review : దర్జా మూవీ రివ్యూ.. లేడీ డాన్‌గా అనుసూయ ఇచ్చిపడేసిందిగా..!