Youth Selfie Video : తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను ఓ అమ్మాయి మోసం చేసిందంటూ అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయినవల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంకు చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.
ఆమెను గాఢంగా ప్రేమించిన అతడు ఇప్పుడు తనను కాదని మరో పెళ్లి చేసుకుంటుందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను ప్రేమించి, డబ్బులు, బంగారం తీసుకుందని, ఇప్పుడు తనను కాకుండా మరొకరికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని ఆ యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను మోసపోయానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం అందరికి తెలియాలనే ఇలా వాట్సాప్ లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.
అమ్మాయితో కలిసి దిగి ఫొటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేయడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రేమించుకుని ఇద్దరు ఉంగారాలు కూడా మార్చుకున్న విషయాన్ని సెల్ఫీ వీడియో తెలిపాడు. వాస్తవానికి ఈ యువకుడికి గతంలోనే మరో యువతితో పెళ్లి అయింది. అయితే వారిద్దరూ విడిపోయినట్టుగా తెలుస్తోంది. మొదటి భార్యతో విడిపోయిన సమయంలోనే ఈ అమ్మాయితో పరిచయం అయినట్టు తెలుస్తోంది.
తనకు ఇంతకముందే పెళ్లి అయిందనే విషయం అమ్మాయికి తెలియడంతోనే మరో పెళ్లికి సిద్ధమైందని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయితో క్లోజ్ గా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువకుడి సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు పోస్టు చేసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also : Samantha : సమంత ‘శాకుంతలం’ మూవీలో విలన్ ఇతడేనట..! కింగ్ అసురతో భారీ ఫైట్ సీన్..!