TRS-BJP : ఏ పార్టీ అయిన రాజకీయ లబ్ధికోసమే పనిచేస్తుంది. అధికారంలో ఉన్న వారు దానిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటే. అధికారంలో లేని పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చేసే కుట్రలు అన్నీ ఇన్నీ కావు. కానీ వీటన్నింటిలో పెద్ద లీడర్లు బాగానే ఉన్న చివరికి బలవుతున్నది మాత్రం కార్యకర్తలే. ప్రస్తుతం తెలంగాణ లోని పరిస్థితులు వీటికి అద్దం పడుతున్నాయి. అధికార పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని తప్పు పట్టడం, దానిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి.
ఇవి సహజమే.. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ మాటలు వదలి దాడులకు తమ శ్రేణులను ఉసిగొలుపుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. హుజూరాబాద్ బైపోల్ లో దెబ్బతిన్నాక టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు టెన్షన్ పెరిగిపోయిందని, దీనికి తోడు బీజేపీ నుంచి పెరిగిన వివర్శలతో ఆయన ఫ్రస్టేషన్‌కు గురువుతున్నారని టాక్. అందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లలో బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పోరాటం చేపట్టారు కేసీఆర్. మరో వైపు ఇందుకు బీజేపీ సైతం ధీటుగానే స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యతని టీఆర్ఎస్ మాటలను తప్పికొడుతోంది.
ఇదిలా ఉండగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తాజాగా చేపట్టిన నల్గొండ పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆయననున అడ్డుకుంటామంటూ అధికార పార్టీకి చెందిన శ్రేణులు ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశాయి. అనుకున్నట్టుగానే బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు ట్రై చేశాయి. దీనికి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు పార్టీల వారు ఒకరిపై మరొకరు దాడికి పాల్పడ్డారు.
రైతులను ఆగమాగం చేసే విధానాలతో అగ్గి రాజేసిన టీఆర్ఎస్ వాటితో చలిని కాచుకుంటున్నదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రెండు పార్టీలు తమ శ్రేణులకు రెచ్చగొట్టి రాక్షసానందాన్ని పొందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిల్లో బలయ్యేది కార్యకర్తలేనని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Read Also : Kuppam Chandrababu : చంద్రబాబుకు షాక్ మీద షాకిస్తున్న కుప్పం ప్రజలు.. కారణం ఏంటంటే?
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.