...

AP News: ఏపీ డిప్యూటీ సీఎం చిత్రపటానికి మద్యం తో అభిషేకం చేసిన టిడిపి కార్యకర్తలు..!

AP News:సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య యుద్ధం నడుస్తోంది.కానీ ఏపీలో మాత్రం అధికార పక్షం ప్రతిపక్షం మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులక్రితం జంగారెడ్డి గూడెంలో కల్తీసారా వల్ల వరుస మరణాలు జరిగాయని టిడిపి అధికారులు పెద్ద ఎత్తున ఈ విషయంపై స్పందించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అది కల్తీసారా కాదని అధికారపక్షం వాదిస్తోంది. ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య మద్యం వార్ జరుగుతూనే ఉంది.

ఇకపోతే అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి మనకు తెలిసిందే.కల్తీసారాపై టీడీపీ ఆందోళనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ ఎక్సైజ్‌ ఆఫీసు ముట్టడికి పిలుపునిచ్చింది టీడీపీ. ఈ విధంగా ఆఫీస్ ముట్టడికి టిడిపి పిలుపునివ్వడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై పలువురు టిడిపి నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇలా ఎక్కడ వారిని అక్కడే హౌస్ అరెస్ట్ చేసి వివాదాలు జరగకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, బోండా ఉమ వంటి వారిని హౌస్ అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా కల్తీ సారాపై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో టీడీపీ కార్యకర్తలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎంనారాయణస్వామి తీరుపై టిడిపి కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. మంత్రి పదవి ఊడుతుందని మతిభ్రమించి నారాయణ స్వామి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుపై అసభ్యకర పదజాలం ఉపయోగించారని టిడిపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి మద్యంతో అభిషేకం నిర్వహిస్తూ ఆందోళన చేపట్టారు.