Free current: ఆ సీఎం బంపర్ ఆఫర్.. ఎండాకాలంలో ఉచిత కరెంట్!

ఏపీ, తెలంగాణలో కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి. అప్పుడప్పుడూ పవర్ కట్లు తప్పడం లేదు. అయితే ఏండాకాలంలో ఉచిత కరెంట్ ఇస్తానని ప్రకటించాడు ఓ సీఎం. ఎక్కడ, ఈ సీఎం ఎవరు అనుకుంటున్నారా… పంజాబ్ సీఎం అండి. పంజాబ్​లో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 1 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Advertisement

శనివారం సాయంత్రం కల్లా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్​ 16న శుభవార్త వింటారని సీఎం భగవంత్​ మాన్​ గురువారం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 200 యూనిట్ల కరెంట్​ ఉచితంగా ఇస్తుంది ఆప్​ ప్రభుత్వం. ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మార్చి 16న భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా ప్రభుత్వం కొలువుదీరిన నెల అనంతరం.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించింది.

Advertisement