Kodali Nani: ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గన్నవరం నియోజక వర్గం ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంది.ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దుట్టా, యార్లగడ్డ ఇద్దరు కూడా వంశీని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు చేయగా వల్లభనేని వంశీ ఒక్కరే వీరిద్దరితో పోటీకి సై అంటున్నారు.
ఇకపోతే తాజాగా వైసీపీ ప్లీనరీలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని గన్నవరం అభ్యర్థి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.రాబోయే ఎన్నికలలో గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీకే టికెట్ కన్ఫామ్ అవుతుందని ఈయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదని కొడాలి నాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.పెనమలూరు టీడీపీ టికెట్ కోసం వెళ్తే.. గన్నవరం, గుడివాడకు వెళ్తారా అని అడగాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఈ రెండు నియోజకవర్గాలలో టిడిపి తరఫున పోటీ చేసే అభ్యర్థులే లేరని, గన్నవరం గుడివాడ నియోజకవర్గం లేరంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ ప్లీనరీలో భాగంగా కొడాలి నాని చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిత్యం ఎన్టీఆర్ వర్ధంతి జయంతులు జరిపే చంద్రబాబుకు తన తండ్రి గుర్తులేదని తన తండ్రిని ఎవరు ఏమన్నా తాను స్పందించరని ఈ సందర్భంగా నాని టిడిపి ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి.