Imran khan : ఇమ్రాన్ ఖాన్‌కు మరో షాక్… తెరపైకి మూడో భార్య ఫ్రెండ్ వ్యవహారం!

Imran khan : పాకిస్థాన్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వేశారు. దాని కారణంగానే ఆ దేశ అసెంబ్లీలో ఊహించని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్తుతం పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేసిన విష‌యం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మూడు నెలల్లోగా ముందస్తు ఎన్నికలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ కామెంట్స్‌ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందిస్తూ.. ఎన్నికల కోసం కనీసం ఆరు నెలల గడువైనా అవసరమని ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగానే మరో వైపు.. బుష్రా బీబీని అడ్డు పెట్టుకుని ఫ‌రాహ్‌ ఖాన్ అవినీతికి పాల్పడిందంటూ పీఎంఎల్ న‌వాజ్ పార్టీ నేత కుర్షీద్ ఆల‌మ్ ఆరోపించారు. ప్ర‌భుత్వ‌ ఆఫీస‌ర్ల బ‌దిలీల కోసం వారి వ‌ద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బు తీసుకున్నట్టు ఫ‌రాహ్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప‌ద‌వి కోల్పోవ‌డంతో.. ఆయ‌న‌తో లింకు ఉన్న స‌న్నిహితులు దేశం విడిచి వెళ్తున్నారని ఆరోపించారు.

Advertisement

Read Also : TS Group 1 and 2 Aspirants : తెలంగాణలో ఎస్ఐ, గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్.. స్టైఫండ్‌ కూడా! ఇప్పుడే అప్లయ్ చేసుకోండి..!

Advertisement