...

Prime minister modi: ప్రధాని మోదీకి రక్తంతో లెటర్.. ఎవరు, ఎందుకు రాశారో తెలుసా?

Prime minister modi: కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో ఉత్తరం రాశారు. రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిని వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు.

Advertisement

Advertisement

అయితే అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో అభ్యర్థులు కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన గౌరవం ఉందని… దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో డబ్బులున్న వారికే ప్రభుత్వ ఉద్యోగమన్న విధానం వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేసిన అభ్యర్థులు, దీని వల్ల తాము మానసికంగా చచ్చిపోయామని అన్నారు. అంతేకాదు.. ఉద్యోగాల్లో తమకు అన్యాయం చేరితే నక్సల్స్ లో చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ… వారి పేర్లు కాని, పోన్ నెంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు.

Advertisement
Advertisement