Vasthu tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఇల్లు కొనుక్కునేటప్పుడో లేదా కట్టుకునేటప్పుడు వాస్తు చూపించుకుంటూ ఉంటాం. వాస్తు శాస్త్ర నిపుణులు చెప్పినట్లుగానే మనం ఇల్లు కట్టించుకుంటాం. కానీ ఇల్లు అద్దెకు తీసుకునేటప్పుడు మాత్రం చాలా మంది వాస్తు గురించి ఆలోచించరు. కానీ ఇళ్లు అద్దెకు తీసుకోవాలనుకునే వాళ్లు కూడా ఓ సారి వాస్తు చూస్కోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎప్పుడూ తూర్పు, ఉత్తర గృహాలను మాత్రమే కిరాయికీ తీసుకోవాలట. తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పుకు నడక సాగే ఇంటిని తీస్కుంటే మంచి జరుగుతుందట. ఆ ఇంట్లో ఆగ్నేయ భాగంలో పడగ గది ఉండరాదట. అలాగే నైరుతి దిశలో బాత్ రూమ్ లేకుండా చూస్కోవాలట.
ఎట్టి పరిస్థితుల్లోనూ గడప లేని ఇంట్లో నివసించరాదట. మిద్దె మీద ఉన్ట్లయితే మెట్ల కింద బాత్ రూమ్ ఉన్న గది తీసుకోవద్దట. దక్షిణం మధ్య భాగంలో కిటికీ ఉండొద్దట. అలాగే వీధి చివరన ఉన్న గృహాన్ని కూడా అద్దెకు తీసుకోవద్దట. శ్మశాన వాటికకు దగ్గర్లో ఉన్న ఇంటిని తీస్కొని ఇబ్బంది పడకూడదని చెబుతున్నారు. ఎదురుగా గుబురు పొదలు ఉండే ఇళ్లను కూడా తీస్కోవద్దట. చెప్పుల దుకాణం ఎదురుగా ఉన్న ఇళ్లను తీస్కుంటే చాలా లాభాలు వస్తాయట. ఎదురుగా లిఫ్ట్ ఉండే ఇంటిని కూడా తీస్కోవద్దట. ఇలాంటి జాగ్రత్తలు పాటించి హాయిగా గడపండి.