Highway Movie Review : ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ” హైవే ” తాజాగా ఓటీటీలో విడుదలైంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కేవీ గుహన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఇటీవల ప్రముఖ ఓటిటి సంస్థ (ఆగస్టు 19, 2022) ఆహాలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ” హైవే ” సినిమా రివ్యూస్ గురించి తెలుసుకుందాం.
నటీనటులు వీరే (Movie Cast) :
Movie Name : | Highway Movie (2022) |
Director : | కేవీ గుహన్ |
Cast : | ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామి ఖేర్ |
Producers : | వెంకట్ తలారి |
Music : | సైమన్ కె కింగ్ |
Release Date : | 19, ఆగస్టు 2022 |
అసలు స్టోరీ ఇదే (Movie Story) :
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. విష్ణు(ఆనంద్ దేవరకొండ) ఒక ఫోటోగ్రాఫర్. కానీ జాబ్ కోసం బెంగళూర్ కి బయలుదేరుతాడు. అలాగే ఈ సినిమాలో తులసి(మానస రాధాకృష్ణన్) తన తల్లితో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తుంది. కానీ అక్కడ ఓనర్ వేధింపులు పెట్టే వేదింపులు భరించలేక అక్కడ నుంచి పారిపోతుంది. ఇదిలా ఉండగా మరో పక్క ఓ సీరియల్ కిల్లర్ డి అలియాస్ దాస్(అభిషేక్ బెనర్జీ) వరుసగా 5 మంది మహిళలను హత్య చేస్తాడు. దీంతో అతన్ని పట్టుకోవటానికి పోలీసులు గాలిస్తూ ఉంటారు. దీంతో తప్పించుకునే ప్రయత్నంలో అటు దాస్, తులసి లు ఇటు ఈ సైకో.. వారి ప్రయాణంలో వీరు ముగ్గురు ఎక్కడైనా ఎదురవుతారా? ఎదురయితే ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడు? అన్నదే ఈ సినిమా స్టోరీ.
Highway Movie Review : ఆనంద్ దేవరకొండ హైవే మూవీ.. ఎలా ఉందంటే?
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో చాలా అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా నటీనటుల విషయానికే వస్తే ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటించిన పాత్ర ఇదివరకు నటించిన పాత్రలతో పోలిస్తే చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఈ సినిమాలో ఆనంద్ నటించిన పాత్ర వల్ల అతనికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ మానస రాధాకృష్ణ తన అందంతోపాటు నటనతో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుది. అలాగే ఈ సినిమా ప్రారంభంలో విలన్ పాత్రకు సంబంధించిన డెవలప్మెంట్ ఆసక్తిగా ఉంది. విలన్ పాత్రలో నటించిన అభిషేక్ బెనర్జీ తనదైన నటన, మ్యానరిజమ్ తో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని ప్రదర్శించాడు.
మైనస్ పాయింట్స్ :
ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్. ఎంతో ఆసక్తికరంగా సాగే ఈ కథకు సరిపోయే పాటలు లేకపోవడం ఈ సినిమాకు మైనస్ పాయింట్. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చాలా లాజికల్ గా ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలలో మాత్రం లాజిక్ మిస్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలలో కథనం బాగా స్లో అవ్వటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. అలాగే కొన్ని సన్నివేశాలలో గ్రాఫికల్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా తెలిసిపోయే విధంగా ఉన్నాయి.
ఈ సినిమాకి దర్శకత్వం, సినిమా ఆటోగ్రఫీ చేసిన కేవీ గుహన్ సినిమా ఆటోగ్రఫర్ గా మంచి మార్క్ చూపించాడు. ఈ సినిమా లో మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, లాజిక్స్ తో పాత్రలను కలపడం, వాటికీ మంచి ముగింపు ఇవ్వడంతో దర్శకుడిగా కుడా ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా లో సైమన్ కే రాజు అందించిన పాటలు పర్వాలేదు అనిపించినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమా స్టోరీకి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, డైలాగులు కూడా పర్వాలేదు.
మొత్తానికి ఈ సినిమా చూస్తే.. ప్రేక్షకులను ఆకట్టుకునే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలకి మంచి లాజిక్స్‌తో కూడిన ముగింపు ఉన్నాయి. ఈ సినిమాలో స్టోరీ నెమ్మదిగా ఉండటం.. మరికొన్ని చోట్ల చిన్న చిన్న లాజిక్స్ మిస్సవ్వడం వంటివి సినిమాకు మైనస్‌గా మారాయి. చివరిగా చూస్తే ‘హైవే‘ సినిమా డీసెంట్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
[ Tufan9 Telugu News ]
ఆనంద్ దేవరకొండ హైవే
మూవీ రివ్యూ & రేటింగ్ : 2.5/5
Read Also : ఇవి కూడా చదవండి..
Tees Maar Khan Movie Review : ‘తీస్ మార్ ఖాన్’ మూవీ రివ్యూ & రేటింగ్… ఆదికి నిజంగా అగ్నిపరీక్షే.. హిట్ పడినట్టేనా?!
Wanted PanduGod Movie Review : ‘వాంటెడ్ పండుగాడ్‘ మూవీ రివ్యూ.. టీవీ స్కిట్‌లకు ఎక్స్‌టెండెడ్ వెర్షన్..!
Commitment Movie Review : ‘కమిట్‌మెంట్’ మూవీ రివ్యూ.. ఐదుగురు అమ్మాయిల ‘మీటూ’ పోరాటం..!