Tejaswi madivada : ఈ మధ్య మనం తరచుగా వింటున్న పేరు కాస్టింగ్ కౌచ్. ఇది ప్రతీ చోటా ఉన్నప్పిటకీ.. గ్లామర్ ఫీల్డ్ లో ఇంకాస్త ఎక్కువ. గతంలో చాలా మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి చాలా ఓపెన్ గా చెప్పారు. మరికొందరేమో ఉదాహరణలతో సహా వివరించారు. మీటూ ఉద్యామ్ని తీసుకొచ్చి.. తమకు ఎదురైన అనుభవాలతో నెట్టింటిని షేక్ చేశారు. ఈ క్రమంలోనే తేజస్వి మడివాడ కూడా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పింది. ముఖ్యంగా కమిట్ మెంట్ ఎలా అడుగుతారు అనే విషయంలో కొన్ని ఉదాహరణలు కూడా వివరించింది.
తేజస్వి తాజాగా క్యాస్టింగ్ కౌచ్ బ్యాక్ గ్రౌండ్ లో కమిట్మెంట్ అనే సినిమాతో ప్రేక్షుకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కేవలం సినిమా ఇండస్ట్రీలోనే క్యాస్టింగ్ కౌచ్ లేదని.. ప్రతీ చోట, ప్రతీ అమ్మాయి ఏదో ఒక సిట్యువేషన్ లో లైంగిక వేధఇంపులకు గురయ్యే ఉంటుందని వివరించింది. అయితే అమ్మాయిలు ఎంత ధైర్యంగా వాటిని ఎదుర్కున్నారనేదే మ్యాటర్ అని చెప్పింది.
తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని.. ఓ ఈవెంట్ లో అయితే దాదాపు 30 మంది తాగి వచ్చి తనను చుట్టుముట్టారని పేర్కొంది. మనతో మాట్లాడే వారిని చూస్తేనే వారు మన దగ్గరకి ఎందుకు వచ్చారో మనకు అర్థం అయిపోతుందని తెలిపింది. అమ్మాయిలంతా స్ట్రాంగ్ గా ఉంటేనే ఇలాంటి సమస్యలను ఈజీగా ఎదుర్కోవచ్చని తేజస్వి వివరించింది.
Read Also : Commitment Movie Review : ‘కమిట్‌మెంట్’ మూవీ రివ్యూ.. ఐదుగురు అమ్మాయిల ‘మీటూ’ పోరాటం..!