Zodiac Signs : 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో కన్య రాశి వారికి గ్రహచార పలితాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధాన గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని సంచారం వల్ల కన్య రాశి వారికి అనుకూల ఫలితాలతో పాటు ప్రతికూల ఫలితాలు కూడా సమానంగా ఉన్నాయి. అయితే ముఖ్యమైన కార్యక్రమాల్లో కన్యా రాశి వాల్లు అప్రమత్తంగా ఉండాలి.
లేకపోతే మనకు తెలియని ఆటంకాలు ఎదురై పనులు ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పద్ధతిలో.. జాగ్రత్తలు తీసుకుంటూ పని ప్రారంభిస్తే కచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. కాలం మీకు వ్యతిరేకంగా ఉంది. ఉద్యోగస్తులు అయితే మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడం మంచిది. లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.
చివరకు ఉద్యోగం పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే చాలా జాగ్రత్తగా త్వరగా పనులను పూర్తి చేయాలి. చెడు ఊహించకోకుండా ముందుకు సాగండి. తోటి వారి సూచనలు అవసరం. నాకెందుకులే వాళ్లిచ్చిన సలహా అనుకోకుండా పాటించండి. దైవ శక్తి సదా కామిమ్మల్ని పాడుతుంది. నవగ్రహ ధ్యానం శక్తినిస్తుంది.