...

VIjay Devarakonda : మహేష్ ప్లేస్ లో ధమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా ” విజయ్ దేవరకొండ “… తుఫాన్ అంటూ !

VIjay Devarakonda : పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టి.. అర్జున్​ రెడ్డి సినిమాతో సూపర్​ హిట్​ కొట్టిన హీరో ” విజయ్​ దేవరకొండ “. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్​గ్రౌండ్​ లేకపోయినా…  కష్టపడి స్టార్​ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్​. ఆ తర్వాత కూడా విభిన్న కథాంశంతో ఉన్న సినిమాలను ఎంచుకుంటూ.. ముందుకు దూసుకెళ్లిపోతున్నాడు. టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోగా ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ… నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించారు.

ఇప్పుడు ప్రస్తుతం ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు ఈ హీరో. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు విజయ్. టాలీవుడ్ లో మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న హీరో విజయ్ అనే చెప్పాలి. ఇప్పటికే పలు బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ‘థమ్స్ అప్’ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు. అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించారు.

అలాంటి బ్రాండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని ‘థమ్స్ అప్’ కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. చేతిలో సాఫ్ట్ డ్రింక్ పట్టుకొని ఉన్న విజయ్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘థమ్స్ అప్.. సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ కూడా తన ట్విట్టర్ పేజ్ లో పేరు చివరన తుఫాన్ అని యాడ్ చేశారు. అలానే ఈ యద్ కి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను కూడా పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ యాడ్ ను టీవీల్లో టెలికాస్ట్ చేయనున్నారు.