Guppedantha Manasu january 31 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఫణీంద్ర వర్మ తెచ్చిన బట్టలు తీసుకొని.. ఏం సంబంధం లేకపోయినా మన ఇంటి గౌరవం పోగొట్టుకోకూడదు కదా నానా అని దేవయాని రిషి తో జగతి వాళ్లకు మొత్తానికి బట్టలు పెడుతుంది.
Guppedantha Manasu january 31 Today Episode
ఈ క్రమంలో వసు కు కూడా బట్టలు పెడతారు. ఆ తర్వాత మహేంద్ర జరిగిన దాన్ని ఎంతో ఆనందంగా భావిస్తూ ఉంటాడు. మరోవైపు రిషి వాళ్ళ తండ్రి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంతోషం మీ ముఖంలో మొదటిసారి చూశాను డాడ్ అంటూ రిషి మనసులో అనుకుంటాడు. ఒకవైపు వసు, జగతిలు జరిగిన దానికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటారు.
ఇక వసు.. మేడమ్ కంగ్రాట్స్ అని జగతికి చెబుతుంది. ఆ తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి తెల్లవారుజామున లేచి భోగి మంటలకు సిద్ధమవుతారు. ఆ భోగి మంటలముందు వారు వేరే స్థాయిలో ఆనందంగా చిందులు వేస్తారు. ఇక మహేంద్ర “జగతి భోగి మంటల చిటపటలులా మన మధ్య దూరం కూడా తగ్గిపోవాలి” అని జగతితో అని ఇద్దరు చేయి.. చేయి కలుపుకుంటారు.
ఆ తర్వాత అందరూ సంక్రాంతి సందడిలో ఆనందంతో ఉరుకలు వేస్తారు. ఆ తర్వాత అక్కడికి రుద్రాణి వచ్చి.. ఏ మహేంద్ర నువ్వు పేషెంట్ అన్న విషయమే మరచి పోయావు అని అంటుంది. దానికి మహేంద్ర తనదైన స్టైల్ లో సమాధానం చెబుతాడు. తరువాత ఇంటిలో భోగిమంటల్లో వేయడానికి వసు, రిషి లు ఇంటిలో పాత వస్తువుల కోసం స్టోర్ రూమ్ కి వెళ్తారు.
ఇక ఇద్దరు ఎదురెదురుగా నిలబడి కళ్ళ లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ ఒక లవ్ సాంగ్ వేసుకుంటారు. ఆ క్రమంలో స్టోర్ లో వసుధరా వేలికి దెబ్బ తగులుతుంది. దాంతో వసు వేలును రిషి నోటిలో పెట్టుకొని నొప్పిని తగ్గిస్తాడు. ఈలోపు అక్కడకు గౌతమ్ వచ్చి మీ ఇద్దరు చీకట్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు.
ఆ తర్వాత ఇంటిని అలంకరించే క్రమంలో రిషి దండ ఇంటి ద్వారానికి కడుతుండగా రిషి పడిపోతూ ఆ దండను వసు మేడలో వేస్తాడు. ఆ మూమెంట్లో వీరిరువురూ మంచి లవ్ బిజియమ్ వేసుకుంటారు. మరోవైపు దేవయాని కూడా జగతి, మహేంద్ర ల మీద అనుకోకుండా పూల వర్షం కురిపిస్తుంది.