Venu swamy: టాలీవుడ్ పై జ్యోతిష్యుకుడు వేణు స్వామి సంచలన కామెంట్సు చేశారు. సెలబ్రిటీల జీవితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారి వైవాహిక జీవితాలు ఎలా ఉంటాయనే దానిపై కామెంట్లు చేశాడు. తన మనసులోని మాటను వెల్లడించాడు. నయనతార, రష్మిక మందన్న, అనుష్కలు వైవాహిక జీవితంలో ఫెయిల్యూర్ లే ఉంటాయని జోస్యం చెప్పాడు.
గ్రహాలు అనుకూలించకపోతే ఎవరైనా చెడు ఫలితాలు అనుభవించాల్సిందేనని అన్నాడు. గ్రహాల ప్రభావం మనుషుల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతాయని చెప్పాడు. వాటిని కాదని ఏమీ చేయలేమని వెల్లడించారు. వేణు స్వామి కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. రంగుల ప్రపంచంలో ఇలా వివాహం అయ్యాక విడిపోయిన వారు చాలా మంది కనిపిస్తారు.
పారితోషికాల విషయంలో రష్మిక మందన్న, నయనతార చాలా మంది తారల కంటే ముందే ఉంటారు. రెమ్యూనరేషన్ విషయంలో వారు ఎక్కడా తగ్గకపోయినా వైవాహిక జీవితంలో మాత్రం వారికి మైనసే ఎదురవుతుందని జోస్యం చెబుతున్నారు వేణు స్వామి.
కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్, శ్రీదేవి లాంటి వాళ్లు. వారు తమ నటనతో అందరిని మెప్పించారు. సినిమాలో తమ కంటూ ఓ ప్రత్యేకత చాటారు. వారి జంటకు ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతారు తమ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని తమకంటూ ఓ నూతన శకం సృష్టించుకున్నారు. సంపాదన పెరిగే కొద్దీ విశ్వాసాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటికి తోడు అన్నింటిని నమ్మాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే జాతకాలు కూడా చూపించుకుంటారని తమ అదృష్యం ఎలా ఉందని ఆరా తీస్తారు.