Viral news: ఆడదానికి ఎక్కడా రక్షణ దొరకడం లేదు. తండ్రి, అన్నా, తమ్ముడు, బాబాయ్, తాత ఇలా ఎక్కడా భద్రత ఉండటం లేదు. ఆడదైతే చాలు అనుకుని కామాంధులు అకృత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా బీహార్ లో కన్న కూతురినే చెరిపాడు ఏ తండ్రి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కామం నెత్తికెక్కడంతో వావి వరసలు మరిచి అఘాయిత్యానికి తెగబడ్డాడు.
ఒకటి కాదు, రెండు కాదు చాలా సార్లు ఇలా రేప్ చేశాడు. తండ్రి చేస్తున్న ఈ అరాచకకాండతో విసిగి వేసారిన ఆ బాదితురాలు.. సీక్రెట్ గా కెమెరాతో తండ్రి చేస్తున్న పనిని వీడియో తీసింది. దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో తండ్రి చేస్తున్న ఘాతుకం బయటకు వచ్చింది. ఆ తండ్రి ఓ టీచర్. అతనికి 50 ఏళ్ల వయస్సు ఉంటుంది. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న విషయం తల్లికి మేనమామకు కూడా తెలుసు. కానీ వారు ఆ తండ్రికే సపోర్ట్ ఇచ్చారు.
ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దని ఆమెపై ఒత్తిడి చేశారు. ఈ విషయంపై ఆ యువతి పోలీసులను కూడా ఆశ్రయించింది. కానీ వారు స్పందించలేదు. దీంతో విసిగిపోయిన ఆ యువతి ఆధారాలు సేకరించేందుకు ప్లాన్ వేసింది. ఎప్పటిలాగే తన తండ్రి తనను రేప్ చేస్తున్నప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో కాస్త బీహార్ లో సంచలనం కావడంతో పోలీసులు కదలక తప్పలేదు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు.