Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఇంటికీ వచ్చిన జగతి మహేంద్ర లు అక్కడ వసు రూమ్ చూసి కాస్త విచారం వ్యక్తం చేస్తారు.
ఈ రోజు ఎపిసోడ్ లో వసు, రిషి కలిసి బస్తీ కి వస్తారు. అక్కడ జగతి వాళ్ళ కారు చూసి రిషి వెనక్కి వెళ్ళి పోతూ ఉండగా అప్పుడు వసు, రిషి చేయి పట్టుకొని పిలుచుకొని వస్తుంది. అక్కడికి వెళ్ళి చూడగా జగతి పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటుంది. మరొక వైపు దేవయాని సాక్షి ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటారు.
మనం ఇద్దరం కలిసి మన దారిలోకి తెచ్చుకోవచ్చు, అప్పుడు నువ్వు, రిషి ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు అని చెబుతుంది. ఆ తర్వాత మహేంద్ర, జగతి, రిషి లు లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఇంతలో వసు రూమ్ దగ్గరికి బస్తీ వాళ్ళు వచ్చి ఇలా పదే పదే మగవాళ్ళు వచ్చి పోతూఉంటే బస్తీ లో నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని అంటుంది.
మరొకవైపు దేవయాని, రిషి, సాక్షి కి పెళ్లి ఫిక్స్ అయింది అనే మహేంద్ర వాళ్ళతో అంటుంది. అంతేకాకుండా కొందరు బాధ్యతలు మరిచి బస్తీలో వాళ్ళ కోసం ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారు అని మహేంద్ర దంపతులను అనడంతో వాళ్లు కోప్పడతారు.
సాక్షినే మన ఇంటికి తగిన కోడలు అని చెప్పడంతో అప్పుడు ఈసీ నన్ను ఈ విషయంలో ఒత్తిడి చేయకండి పెద్దమ్మ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రిషి, వసు దగ్గరికి వెళ్లగా అక్కడ వసు బస్తీ వాళ్ళు అన్న మాటలను గుర్తు తెచ్చుకుని మీరు ఇకపై మా ఇంటికి రావద్దు సార్ అని చెప్పి ముఖంపైన తలుపులు వేస్తుంది.
దీనితో రిషి ఎంతో బాధపడుతుండగా ఇంతలో అక్కడికి వచ్చిన మహేంద్ర, రిషికి ధైర్యం చెబుతాడు. రేపటి ఎపిసోడ్ లో గౌతమ్, వసు కి ఐ లవ్ యు చెప్పడానికి వెళ్తున్నాను అని చెప్పడంతో రిషి కూడా ఎంకరేజ్ చేసి వెళ్లమని చెబుతాడు. గౌతమ్, వసు దగ్గరికి వెళ్లి ఐ లవ్ యు చెప్పడంతో వసు ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World