...

Guppedantha Manasu: రిషితో తన బాధను పంచుకున్న వసు.. సంతోషంలో రిషిని హగ్ చేసుకున్న వసు!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వసు ఈ లెటర్ ఎవరు రాసి ఉంటారు అని ఆలోచన వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఒకవేళ రిషి సార్ రాసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా నేను ఈ లెటర్ చదువుతుంటే నా గురించి ఈ సర్ గుర్తుకు వస్తున్నారు ఏమిటి? అని మనసులో అనుకుంటుంది. అసలు నా మనసులో ఎవరున్నారు అని ఆలోచిస్తుంది.

ఇక రిషి సార్ లో ఏదో మార్పు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రిషి సార్ తో ఉంటే నాకు ఏదో ధైర్యం పెరిగినట్టు అనిపిస్తుంది అని అనుకుంటుంది. అదే క్రమంలో సార్ నా మీద ఎందుకు ఇంత బాధ్యత వహిస్తారు. సార్ కి నా మీద ఉన్న బాధ్యత వల్లనే నా.. లేక మా ఇద్దరి మధ్య తెలియని బంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఈ లోపు వసు ఉండే కాలనీ లో ఒక చిన్న పిల్లాడు వచ్చి.. అక్క ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు. అంతేకాకుండా ఆ బొమ్మను చూసి బొమ్మ ఒకేలా ఉందక్క అని అంటాడు. అంతేకాకుండా బొమ్మను తీసుకొని పరిగెత్తాడు. ఇక తన తోటి పిల్లలు అందరికి చూపిస్తుండగా ఆ బొమ్మ రెండు ముక్కలుగా చిరుగుతుంది.

ఇక దీన్ని పక్కనే ఉన్న రిషి కూడా గమనిస్తాడు. ఆ రెండు ముక్కలు చూసుకుంటూ వసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఈలోపు అక్కడకు రిషి వచ్చి దీనికే ఏడుస్తున్నావా? అని అంటాడు. దాంతో వసు ఎంత అభిమానం ఉంటే నా బొమ్మను ఎప్పుడో చూసి ఎలా గీస్తారు సార్ అని అంటుంది.

వాళ్ళ కళ్ళకి హ్యాట్సాఫ్ సార్ అంటుంది. అందుకే ఏడుస్తున్నాను అని అంటుంది. ఆ తర్వాత వసు కళ్లు చెదిరిపోయక బొమ్మను అతికించి ఎం లాభం అని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు రిషి మళ్ళీ వసు బొమ్మను గీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక బొమ్మను గీసి వసు పనిచేసే రెస్టారెంట్ కి తీసుకొని వస్తాడు.

రెస్టారెంట్ బయట ఉన్న ఒక పిల్లవాడితో ఆ బొమ్మను రిషి వసుకు సెండ్ చేస్తాడు. ఇక దాంతో వసు ఎంతో ఆనంద పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ విషయాన్ని రెస్టారెంట్ కి వచ్చిన రిషి తో అందంగా పంచుకుంటుంది. ఇక ఈ బొమ్మ ఎవరు ఇచ్చారో ఆ బాబును అడుగుతాను అని అంటుంది. దాంతో రిషి టెన్షన్ పడుతూ ఉంటాడు.

ఇక రేపటి భాగం లో వసు రిషి సార్ కి ఈ బొమ్మ తో ఏమైనా సంబంధం ఉందా అని వసు ఆలోచిస్తుంది. ఇక రిషి ఈ బొమ్మ గీసింది నేనే అయితే అని అంటాడు. దాంతో వసు రిషిను ఒక్కసారిగా హాగ్ చేసుకుంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.