...

Guppedantha Manasu: రిషిని మాటలతో బాధ పెట్టిన వసు.. ఆనందంలో దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వసు, రిషి ని తన రూమ్ కి తీసుకుని వెళ్లి వంట చేసి పెడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి, వసు చేసిన వంటకాలు తింటూ వంటకాలు బాగా ఉన్నాయి అని పొగుడుతూ ఉంటాడు. అయితే ఇంతలో పక్కింటి ఆమె వారిద్దరిని చూసి వీరు భోజనం చేసే వరకు వచ్చారా అని అనుకుంటూ ఉంటుంది. వసుకి అవసరంగా రూమ్ ఇచ్చామెమో అని ఇరుగుపొరుగు వారు అనుకుంటూ ఉంటారు.

ఆ తరువాత రిషి అన్నం తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బస్తి వాళ్ళు అక్కడికి వచ్చి అతను ఎవరు? ఎందుకు వస్తున్నాడు? ఎందుకు వెళ్తున్నాడు అంటూ రిషి గురించి వసు ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ అనుమానించడంతో వసు బాధపడుతూ ఉంటుంది. తరువాత బస్తీ లో వసు ని అవమానించిన ఆమె దేవయాని కి ఫోన్ చేసి పని బాగానే జరిగింది అని చెప్పడంతో దేవయాని నవ్వుతూ ఉంటుంది.

ఇంతలో అక్కడికి వచ్చిన ధరణి మళ్లీ ఈమె ఏదో కుట్ర చేసింది అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. మరొక వైపు గౌతమ్ రిషి వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి మహేంద్ర వస్తాడు. గౌతమ్ సాక్షి గురించి అడగగా స్వీట్ గా వార్నింగ్ ఇస్తాడు రిషి.

ఇంతలో రిషికి సాక్షి ఫోన్ చేయడంతో కట్ చేస్తాడు. ఇంతలో జగతి వాళ్ల కోసం జ్యూస్ తీసుకుని రాగా రిషి మాత్రం ఆ జ్యూస్ తీసుకోకపోవడంతో జగతి మనసులో బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు వసుకి ఒకరి తర్వాత మరొకరు కంపెనీ వాళ్ళు ఫోన్ చేసి విధిస్తుండటంతో, ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు.

రిషి ను కంపెనీవాడు అనుకున్న చడా మడా తిట్టేస్తుంది. ఆ తరువాత వారిద్దరూ కలసి రెస్టారెంట్ కి తినడానికి వెళ్తారు. వాళ్ళు అలా వెళ్లగానే మహేంద్ర జగతి లు వసు రూమ్ కి వస్తారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.