...

Intinti Gruhalakshmi: నందుకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన తులసి..శృతికి సపర్యలు చేస్తున్న ప్రేమ్..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో లాస్య,నందులు పార్క్ లో వాకింగ్ కి వెళ్ళగా అక్కడ వాళ్లకు తులసి ఎదురుపడుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో తులసి కోసం పార్క్ లో ప్రవళిక ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో తులసి వస్తుంది. వాకింగ్ డ్రస్సు వేసుకొని దానిపై శాలువా కప్పుకొని వస్తుంది. అప్పుడు ప్రవళిక తులసి ని చూసి షాక్ అయి నవ్వుకుంటుంది. అప్పుడు తులసీ తనకు ఆ డ్రస్ కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పగా కాసేపు హితబోధ చేస్తుంది.

ఎవరైనా నిన్ను విచిత్రంగా చూస్తే రేపటి నుంచి వాకింగ్ కి రావద్దు అని అంటుంది. దాంతో తులసి తను కప్పుకున్న శాలువా తీసి నిల్చుంటుంది. తులసి ఆనందంగా ప్రవళిక తో కలిసి వాకింగ్ చేస్తూ ఉండగా తులసిని నందు లాస్య చూస్తారు. ఇక వాకింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్తాను అని చెప్పి తులసి ఇంటికి వెళ్తుండగా మధ్యలో లాస్య,నందు కనిపిస్తారు.

తులసిని ఆ డ్రెస్ లో చూసి నందు గట్టిగా తులసి అంటూ పిలుస్తాడు. దానితో ప్రవళిక అక్కడ ఆగి ఏం జరుగుతుందా అన్న విధంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు నందు తులసి మండిపడుతూ వయసు మీద పడ్డాక కూడా ఇలాంటివి ఏంటి అని ప్రశ్నించగా.. అప్పుడు తులసి మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని అనటంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతాడు.

అప్పుడు భారీగా డైలాగులు కూడా తులసీని నిందిస్తాడు. కానీ నందు మాటలకు తులసి ఏమాత్రం భయపడకుండా నందుకి గట్టిగా సమాధానం ఇస్తుంది. నందు మాత్రం తనకు భార్య హక్కు ఉన్నట్టుగా మాట్లాడటంతో వెంటనే తులసి పక్కనే ఉన్న నీ భార్యకు చెప్పమని అంటుంది.

ఈ పక్కనే ఉన్న భార్య వేసుకునే డ్రెస్సులు గురించి ప్రశ్నించు అంటూ గట్టిగా క్లాస్ పీకుతుంది తులసి. మరొకవైపు శృతి హెల్త్ బాగా లేకపోయినా అలాగే వంట చేస్తూ ఉండడంతో ప్రేమ్ రెస్ట్ తీసుకోమని చెబుతాడు. మరొకవైపు తులసి ఇంటికి రావడంతో తల్లి గెటప్ చూసి దివ్య ఫిదా అవుతుంది.

ఆ తరువాత తులసి దివ్య ఫీజు గురించి ఆలోచించటం తో ప్రవళిక తులసి చిన్ననాటి కళ గురించి గుర్తుకు చేస్తుంది. మళ్లీ గాయనిగా మారు అని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.