Akshaya Tritiya : తెలుగువారు జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి మహావిష్ణువు పూజలు చేస్తారు. ఇక ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసే బంగారు లేదా వెండి కొనడం వల్ల వారికి అదృష్టం కలిసివస్తుందని వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు పెద్ద సంఖ్యలో బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే ప్రతి ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది అక్షయతృతీయ జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

Akshaya Tritiya
పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుక్లపక్షం తృతీయ తిథి రోజు బ్రహ్మ కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించాడు. అందుకే ప్రతి ఏడాది వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ తిథి రోజు అక్షయ తృతీయను జరుపుకుంటాము. ఇదే రోజే గంగాదేవి అవతరణ పరశురాముడు జయంతి కూడా జరుపుకుంటాము. ఇక ఈ ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది అనే విషయానికి వస్తే మే 3, 2022 వ తేదీ అక్షయ తృతీయను జరుపుకుంటారు.
ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి సరైన ముహుర్తం ఏది అనే విషయానికి వస్తే… మే 3 వ తేదీ ఉదయం5:18 నుంచి మరుసటి రోజు మే4 వ తేదీ 07:23 వరకు ఎంతో అనువైన సమయం. ఇక అక్షయ తృతీయ రోజు విష్ణు పూజ చేయాలని భావించేవారు మే మూడవ తేదీ ఉదయం 05:32 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు అనువైన సమయం అని చెప్పాలి. ఈ రోజు కనుక వెండి బంగారు నగలను కొనుగోలు చేయడం వల్ల వారి సంపద, ఆస్తిలో పురోగతి కలుగుతుందని భావిస్తారు.
Read Also :Akshaya tritiya : అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాముఖ్యత.. ఆ విశేషాలేంటంటే?