Akshaya tritiya : అక్షయ తృతీయకు ఎందుకంత ప్రాముఖ్యత.. ఆ విశేషాలేంటంటే?

Akshaya tritiya : పసిడి కొనేందుకు అక్షయ తృతీయను మంచి రోజుగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజు కొంతైన బంగారాన్ని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఆ రోజు ఎంతో కొంత బంగారం ఇంట్లోకి వస్తే సంవత్సరం మొత్తం పసిడి వరిస్తుందని అంటారు పండితులు. అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి.. ఆ రోజు ఎందుకు బంగారం కొనాలని అందరూ అంటుంటారు. దీని వెనక ఉన్న ఆచారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అక్షయ తృతీయ వచ్చే నెలలోనే వస్తోంది. మే 3 వ తేదీన అక్షయ తృతీయ. రోహిణీ నక్షత్రంలో మధ్యాహ్నం 12:34 గంటలకు అక్షయ తృతీయ గడియలు ప్రారంభమవుతాయి.

Akshaya tritiya
Akshaya tritiya

అలాగే మే 4 వ తేదీ మధ్యాహ్నం 3:18 గంటలకు ముగుస్తున్నాయి. అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం మాత్రమే కాకుండా పట్టు వస్త్రాలు, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు దాతృత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యతను ఇస్తారు. దానం చేయడం వల్ల ధాన్యం సుసంపన్నం అవుతుందని విశ్వసిస్తారు. విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పరశురామ జయంతిని కూడా ఈ రోజునే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. భగీరథుని కఠోరమైన తపస్సుకు సంతోషిస్తూ ఈ రోజ గంగామాత భూమిపైకి వచ్చిందని మరి కొన్ని శాస్త్రాల్లో ఉంది. అంతే కాదు, ఈ రోజున అన్నపూర్ణ తల్లి జన్మించిందని కూడా నమ్ముతారు.

నర-నారాయణుడు అక్షయ తృతీయ రో అవతరించినట్లు నమ్ముతారు. మహాభారతం ప్రకారం, ఈ రోజున శ్రీకృష్ణుడు పాండవుల వనవాస సమయంలో వారికి అక్షయ పాత్ర ఇచ్చాడని భావగవతంలో ఉంది. ఈ అక్షయ పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఎల్లప్పుడూ ఆహారంతో నిండి ఉంటుంది. దీంతో పాండవులకు వనవాసంలో ఉన్నా వారికి ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు.

Advertisement

Read Also :Vastu Tips : సంధ్యా సమయం తర్వాత పొరపాటున ఈ వస్తువులు దానం చేస్తున్నారా… సమస్యలు తప్పవు..!

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel