...

Jabardasth: జబర్దస్త్ షోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన నవ్వుల రారాణి.. ఇక రచ్చ మామూలుగా ఉండదు!

Jabardasth: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్, నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో ఎన్నో సినిమాలలో, స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న ఇంద్రజ, ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అతి తక్కువ సమయంలోనే జెడ్జ్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే ఇప్పటికే పలుసార్లు జబర్దస్త్ షో కి జడ్జి గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి తన కల్మషం లేని నవ్వుతో అందరినీ అలరించడానికి సిద్ధపడింది నటి ఇంద్రజ.

అయితే మొదట్లో జబర్దస్త్ షోకి కొద్దీ రోజులపాటు జడ్జ్ గా నిర్వహించిన ఇంద్రజ ఆ తర్వాత జబర్దస్త్ షో కి దూరమై శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. రోజాకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రోజా సీటును భర్తీ చేసిన ఇంద్రజ, స్కిట్ లలో ఇన్వాల్వ్ అవుతు, మనస్పూర్తిగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం చేసింది. దీనితో రోజా కాకుండా ఇంద్రజ జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తేనే బాగుంటుందని ఎంతోమంది డిమాండ్ కూడా చేశారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. కానీ కొద్దిరోజులకు రోజా ఆరోగ్యం బాగుపడడంతో మళ్ళీ జడ్జిగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఇటీవలే రోజాకు మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ షో నుంచి విడిపోయింది. మంత్రి పదవికి ప్రమాణ శ్రీకారం చేసిన రోజే తాను ఇకపై జబర్దస్త్ షో కి ఈవెంట్లకు గుడ్ బై చెబుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. జబర్దస్త్ షోలోకి రోజా స్థానంలోకి ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఆలోచిస్తున్న సమయంలో నవ్వుల రాణి అయిన ఇంద్రజ మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇదిలాఉంటే ఇటీవలే ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమోలో ఇంద్రజ, పూర్ణలు జడ్జీలుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఇంద్రజ స్కిట్ లలోని డైలాగులకు పడి పడి నవ్వుతూ కామెడీని బాగా ఎంజాయ్ చేసింది. కల్మషం లేని నవ్వుతో మరొకసారి బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ ఆర్టిస్టులను ఆకర్షించింది. అయితే రోజా వెళ్ళి పోయినందుకు బాధపడుతున్న కొంతమంది ప్రేక్షకులు జడ్జిగా ఇంద్రజ ఎంట్రీ ఇవ్వడంతో కాస్త ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.