...

Surekha vani daughter: టాలీవుడ్ లోకి సురేఖ వాణి కూతురు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్!

Surekha vani daughter: రేపో మాపో అనుకుంటున్న ముహూర్తం రానే వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కంటే ఇన్ స్టా హాట్ ఆంటీగా కుర్రకారుకు పరిచయమున్న నటి సురేఖ వాణి కూతురు సినిమాల్లోకి వచ్చేస్తోంది. టాలీవుడ్ లో ఎంతో కాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న సురేఖ చాలా మందికి తెలిసిన నటే. సహాయ పాత్రల్లోనే కాకుండా అప్పుడప్పుడు కామెడీ పాత్రల్లోనూ చేసి మెప్పించింది ఈ ఆంటీ. అంతకు మించి ఇన్ స్టాలో హాట్ హాట్ ఫోటోలు పెడుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది సురేఖ వాణి.

తల్లికి తగ్గ కూతురు అన్నట్లుగా ఉంటుంది సుప్రిత. తల్లీ కూతుళ్లు కలిసి సాంగ్స్ కు డ్యాన్సులు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటారు. పొదుపైన డ్రెస్సులతో ఈ వయస్సులోనూ కూతురికి పోటీగా తన అంద చెందాలను చూపిస్తుంది సురేఖ.

తగ్గేదేలె అనే రేంజ్ ఉంటుంది వీళ్ల పర్ఫార్మెన్స్. తల్లి సురేఖ వాణి బాటలోనే నడుస్తోంది అందుకే తన సుప్రిత కూడా ఇన్ స్టాగ్రామ్ నుండే ప్రేక్షకులను దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు సుప్రిత చేసిన రీల్స్ కు, ఫోటో షూట్స్ కు సోషల్ మీడియాలో బాగానే లైకులు వచ్చాయి. ఇక పలు షార్ట్ ఫిల్స్మ్ లో కూడా సుప్రిత నటించింది. అందులో తన నటనతో మెప్పించింది కూడా.

ఇక త్వరలోనే మంచు లక్ష్మీ చేస్తున్న చిత్రంలో నటిగా వెండి తెరకు పరిచయం కానుంది సుప్రిత. ‘లేచింది మహిళా లోకం’ అనే టైటిల్ తో మంచు లక్ష్మీ ఇటీవల ఒక కొత్త చిత్రం ప్రారంభించింది. ఇందులో మంచు లక్ష్మీతో పాటు శ్రద్ధా దాస్, హేమ లాంటి ఇతర నటీమణులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సుప్రిత కూడా ఓ ముఖ్య పాత్రలో నటించనుంది. ఈ మూవీ గురించి సుప్రిత తన సోషల్ మీడియో పోస్టు చేయకపోయినా… మంచు లక్ష్మీ పోస్టు చేసిన ఫస్ట్ లుక్ తో ఈ విషయం బయటకు వచ్చింది.