Viral Video : నదిలో తేలుతున్న బ్యాగ్.. అనుమానం వచ్చి చూస్తే మైండ్ బ్లాక్.. వీడియో వైరల్!

Viral Video : సాధారణంగా మనం ఎన్నో సినిమాలలో గాలిలో డబ్బులు ఎగురుతూ రావడం లేదంటే రోడ్లపై డబ్బులు కట్టలు పడి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఇలా నిజజీవితంలో కూడా గాలిలో డబ్బులు ఎగురుతూ వస్తే ఎంతో బాగుంటుందో అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అయితే అచ్చం ఇలాగే నదిలో ఒక బ్యాగ్ తేలుతూ స్థానికుల కంటపడింది. దీంతో ఆశ్చర్యపోయిన స్థానికులు ఆ బేగ్ లో ఏముంది అని అని తెలుసుకొని సాహసం చేశారు. ఇలా ఆ బ్యాగ్ బయటికి తీసి చూడగా ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బ్యాగ్ నిండా డబ్బులు కట్టలు ఉండడంతో అందరి మైండ్ బ్లాక్ అయింది అని చెప్పాలి. మరి ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే…

Advertisement

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు నీటిలో తేలియాడుతూ రావడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు చేరవేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ నోట్ల కట్టలను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ..

Advertisement

పుష్కర్​రోడ్డులోని ఈ సరస్సులో పాలిథిన్ బ్యాగులో రెండు వేల రూపాయల నోట్ల కట్టలు 32 నీటిలో తేలియాడుతూ కొట్టుకు వచ్చాయి అని వెల్లడించారు. అయితే ఇవన్నీ కూడా రెండు వేల రూపాయల నోట్లు కావడం గమనార్హం. ఇక ఈ సమాచారం వారికి అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆ డబ్బు నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవి నిజమైన నోట్ల లేదా నకిలీవా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇలా పాలిథిన్ బ్యాగులో డబ్బులను కట్టలుగా పెట్టి సరస్సులో వేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఇలా డబ్బులు పడేయటం వెనుక ఉన్న కారణం ఏమిటి అనే విషయాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement