Mahesh babu paris trip: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతూ.. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన కాస్త విరామం దొరికినా.. ఫ్యామిలీతో గడుపుతుంటారు. ఈ క్రమంలోనే ఏడాదికి మూడు నాలుగు సార్లు హాలిడే వెకేషన్ కు వెళ్లే మిల్క్ బాయు తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ప్యారిస్ వెళ్లారు. ఈ క్రమంలోనే వీరి ప్యాలెస్ కు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫ్యామిలీతో పాటు ప్యారిస్ వెళ్లిన మహేష్ బాబు లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్ లో దిగడం మహేష్ బాబుకు అలవాటు. ఎంతో విలాసవంతమైన ఆ హోటల్ లో అధ్బుతమైన సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
అందుకే మిల్క్ బాయ్ మహేష్ బాబు ప్యారిస్ వెళ్లినప్పుడల్లా అదే హోటళ్లో బస చేస్తుంటారట. ఇక ఈ హోటల్ లో ఒఖ రోజుకు రూమ్ రెంట్ ఎంత చెల్లిస్తారో తెలిస్తే మనం నోరెళ్లబెడతాం. అత్యాధునిక సదుపాయాలు గల ఈ హోటల్ లో ఒక్క రోజుకు లక్షన్నర రూపాయల రెంట్ చెల్లిస్తారట. అయితే ఈరోజుతో ఆయన పర్యటన ముగుస్తుందని… నేడే ఫ్యామిలీతో కలిసి ఇండియా వస్తారని తెలుస్తోంది.