Karthika Deepam April 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో హిమ, సౌర్య గురించి ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటు ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లు సౌర్య ను కలవడం కోసం హిమ ఆటో స్టాండ్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి ఏంటి తింగరి ఇక్కడికి రమ్మన్నావు అని అడగగా, నాకు అలా అలా బయట తిరగాలని ఉంది అని హిమ అనడంతో సౌర్య సంతోషపడుతుంది.
మరి నువ్వు ఇలా వచ్చేస్తే హాస్పిటల్లో పేషంట్ల ను ఎవరు చూసుకుంటారు అని అనగా మీ డాక్టర్ సాబ్ ఉంటాడులే అని అంటుంది హిమ. ఆ మాటకు జ్వాలా సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు నిరూపమ్, తండ్రి సత్యను నీకు మమ్మీ కి గొడవ ఎక్కడ వచ్చింది అని అడగగా అప్పుడు సత్య సమయం సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఇంతలో కోపంతో వెళ్లిన స్వప్న ఆనందరావు కు జరిగినదంతా వివరిస్తుంది. మరొకవైపు రోడ్డుపై ఒక ముసలమ్మను ఎవరో ఢీకొని వెళ్లిపోగా అక్కడున్నవారంతా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో జ్వాలా అక్కడికి వచ్చి సహాయం చేయమని అడిగి ఆటోలో ఆ ముసలావిడను తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడగా ఇంతలో ఆమె దాహం అని అనడంతో పక్కనే ఒక అబ్బాయి వెళుతుంటే అతని దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకుని వస్తున్న క్రమంలో ఆ వాటర్ సౌందర్య పై పడతాయి.
వెంటనే సౌర్య తన మనసులో లోపల ఆనంద పడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య కోపంతో విరుచుకు పడుతుంది. కానీ జ్వాలా మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ ముసలావిడ హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంది. మరొకవైపు హిమ హాస్పిటల్ లో చిన్న పిల్ల గా మారి పిల్లలతో కలిసి ఆటలాడుతూ ఉండగా ఇంతలో నిరూపమ్ అక్కడికి వచ్చి నువ్వు నిజంగానే మారిపోయావు హిమ అని అంటాడు.
ఇంతలో జ్వాలా ఆ ముసలామెను హాస్పిటల్ కి తీసుకుని వచ్చి జాయిన్ చేస్తుంది. మరొకవైపు ఒకచోట హిమ, జ్వాలా కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి సౌందర్య ఆనందరావు లు వస్తారు. వారిని చూసిన జ్వాల ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో హిమ, జ్వాలా చేతి పై ఉన్న పచ్చబొట్టు ని చూపిస్తూ ఈ జ్వాలే మన సౌర్య అని చెప్పగా సౌందర్య ఆనందరావు లు ఆనందపడతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..
Read Also :Karthika Deepam: నిరూపమ్ పై మండిపడ్డ స్వప్న .. సంతోషంలో హిమ..?