...

Hero Siddarth : వివాదంగా మారిన సిద్దార్థ్ ట్విట్..మహిళా కమిషన్ ఆగ్రహం..!

Hero Siddarth : హీరో సిద్ధార్థ్ తన ట్విట్ తో మరొకసారి చర్చలో నిలిచారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ట్రోల్ అవుతున్నారు. అంతే కాదు జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలాగే సింగర్ చిన్మయి శ్రీపాద కూడా అతనిపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యింది. సిద్ధార్థ్ తరచూ ఏదో ఒక అంశంపై ట్విట్టర్లో స్పందిస్తూ ఉంటాడు.

Advertisement

ట్విట్లతో ఆటాడుకుందాం అనుకుంటాడు కానీ ఈసారి చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది. బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ గురించి సోషల్ మీడియా లో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ గురించి ఈ చర్చ జరుగుతోంది. పంజాబ్ లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింత ఘటన తో భద్రతా లోపంపై సైనా నెహ్వాల్ ట్విట్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తున్నానని ప్రధాని సెక్యూరిటీ విషయంలో అలసత్వం పనికిరాదన్నారు సైనా.

Advertisement

Advertisement

ప్రధానికే రక్షణ లేకపోతే మన పరిస్థితి ఏంటంటూ ప్రశ్నించారు. ప్రజలు ఇలాంటి ఘటనను చూస్తూ ఉండిపోరని దేశం మొత్తం ప్రధాని వెంట ఉందంటూ ట్వీట్ చేశారు సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్ ట్వీట్ కు స్పందిస్తూ హీరో సిద్ధార్థ్ ట్విట్ చేయడం వివాదానికి దారి తీసింది. ప్రపంచ కాక్ ఛాంపియన్ మన దేశానికి రక్షణగా ఉన్నందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో నెటిజన్లు సిద్ధార్థ్ ను ఆటాడుకుంటున్నారు.

Advertisement

అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్థ్ పై చర్యలు తీసుకోవాలంటూ మహారాష్ట్ర డిజిపికి లేఖ రాసింది. సిద్ధార్థ్ ట్వీట్ అసభ్యకరంగా ఉందని, మహిళలను కించపరిచారని ఫైర్ అయ్యింది. సిద్ధార్థ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరింది. డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది ఎన్ సిడబ్ల్యూ. ట్విట్ పై సిద్ధార్థ్ విచారించాలని కోరింది మహిళా కమిషన్. అటు నెటిజన్లు, ఇటు జాతీయ మహిళా కమిషన్ ఫైర్ అవ్వడంతో హీరో సిద్ధార్థ్ మరొక ట్వీట్ చేశారు. కాక్,బుల్ లో తేడా ఉంది.

Advertisement

మనం చదివే దాన్ని బట్టి అర్థం మారిపోతుందన్నారు. కించపరిచారని తన ఉద్దేశం కాదని మరొక ట్వీట్ చేశారు సిద్ధార్థ్. హీరో సిద్ధార్థ్ ను గతంలోనూ నెటిజన్లు ఆటాడుకున్నారు. హీరో నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటనపై కూడా ట్వీట్ చేయడం ఆగ్రహానికి గురి చేసింది. బొమ్మరిల్లు సినిమాలో లాగా బుద్ధిమంతునివి అనుకుంటే ఇదేం పద్దతి అని కామెంట్స్ చేశారు. ఇలా అనేక అంశాల పై ట్వీట్ చేస్తూ ట్రోలింగ్ కు గురవుతున్నారు సిద్దు.

Advertisement

Read Also : Pushpa : కేక పుట్టించిన పుష్ప.. పుష్పరాజ్.. ఆ బాలీవుడ్ నటులు ఏమంటున్నారంటే..!

Advertisement
Advertisement