...

Viral Video: ఇదేం ఫైటింగ్ రా స్వామి..అబ్బాయిల కన్నా దారుణంగా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు… వీడియో వైరల్!

Viral Video : సాధారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఒకరితో మరొకరు ఎంతో స్నేహబంధం ఉండి ఎంతో చెలిమిగా ఉంటారు. అయితే కొన్నిసార్లు పాఠశాలలలో అబ్బాయిల మధ్య గొడవలు తలెత్తడం గురించి మనం విన్నాం.. కానీ అమ్మాయిలు అబ్బాయిలను మించి గొడవపడటం ఒకరినొకరు కొట్టుకోవడం గురించి మీరు విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.తమిళనాడులో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే…

school-students-are-fighting-video-goes-viral
school-students-are-fighting-video-goes-viral

మదురై పెరియార్‌ టౌన్‌ బస్టాండ్‌లో పదుల సఖ్యలో రెండు గ్రూపులుగా విద్యార్థినిలు విడిపోయి పిచ్చ కొట్టుడు కొట్టుకున్నారు. వీరి గొడవ చూస్తుంటే పెద్ద యుద్ధమే జరిగేలా ఉంది. ఇలా అరగంట పాటు ఈ రెండు గ్రూపుల మధ్య తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకుంది. అక్కడికి వీరి గొడవను ఆపడం కోసం ప్రయాణికులు ప్రయత్నించినా ఏమాత్రం లెక్క చేయకుండా ఒకరిని మించి మరొకరు కొట్టుకున్నారు. ఈ విధంగా విద్యార్థులు కొట్టుకుంటుండగా మరి కొందరు వీరిని విజిల్స్ వేస్తూ వీరిని ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు ఈ గొడవను వారి సెల్ ఫోన్లో చిత్రీకరించారు.

ఇలా ఎంతసేపటికి ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ సద్దుమణగక పోవడంతో చివరికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా పోలీసులు రాగానే విద్యార్థినిలు ఎక్కడి వారు అక్కడికి పరుగులు పెట్టారు.అయితే ఈ విద్యార్థినిలు సమీప ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారుగా పోలీసులు గుర్తించి 14 మందిపై కేసు నమోదు చేశారు. ఇక ఆ రోజు రాత్రికి ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో విద్యాశాఖ అధికారుల వరకు చేరడంతో విద్యాశాఖ విద్యార్థులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ అలాంటి విద్యార్థులకు టీచర్లు తప్పనిసరిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏది ఏమైనా ఈ విద్యార్థినిలు అబ్బాయిలను మించిపోయి కొట్టుకున్నారని తెలుస్తోంది. మరెందుకాలస్యం ఈ వీడియో మీరు ఓ లుక్కేయండి.

Read Also : Doctor negligence: చనిపోయిందని శ్మశానానికి తీసుకెళ్లారు.. కానీ చివరి నిమిషంలో!