Keerthy suresh: మహానటి సినిమాతో తన ప్రతిభను చాటి చెప్పింది కీర్తి సురేష్. ఆ సినిమాలో కీర్తి నటన చాలా మందిని ఆకట్టుకుంది. సినీ పెద్దలతో పాటు చాలా మంది ఆమె నటనకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ మలయాళీ ముద్దుగుమ్మ మహానటి సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఇటీవలె మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలోనూ నటించి మెప్పించింది కీర్తి సురేష్. తాజాగా సోషల్ మీడియాలో కీర్తి తన సంబరాన్ని పంచుకుంది. అయితే అది సినిమాకు సంబంధించింది ఏమాత్రం కాదు. తన కుక్క పిల్లతో కొన్ని పిక్స్ పోస్టు చేసి మురిసిపోయింది ఈ మహానటి.
తన పెట్ డాగ్ తొలిసారి విమాన ప్రయాణం చేసిందట. విమానంలో ప్రయాణిస్తున్న ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసి తెగ మురిసిపోయింది. చార్టెడ్ ఫ్లైట్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలోని తన అకౌంట్ లో షేర్ చేసింది ఈ భామ.
ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి సినిమాలో నటిస్తోంది. భోళా శంకర్ అనే సినిమాలో మెగాస్టార్ కు చెల్లెలిగా కనిపించనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు రీమేక్ గా వస్తోంది. మెహెర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఖీ పండగ సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేసింది మూవీ టీం. ఈ సినిమానే కాకుండా మరో తెలుగు రీమేక్ సినిమాలో బాలీవుడ్ లో నటిస్తోంది.