Samantha : నాకు ఇదే తగిన గుణపాఠం.. చైతూపై సామ్ సంచలన పోస్ట్..?  

Samantha Sensational Comments on Naga Chaitanya
Samantha Sensational Comments on Naga Chaitanya

Samantha : సమంత  ఈ మధ్యకాలంలో వరుసగా పోస్టులు పెడుతూ వస్తోంది. అయితే, ఈ పోస్టులు ఎవరి కోసం పెడుతుందో అర్థం కాక అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. కొందరు మాత్రం తన మాజీ భర్త నాగచైతన్య కోసమే సమంత ఈ విధంగా పోస్టులు పెడుతోందని కాన్ఫామ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లోనే క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సామ్-చై జంట తమ వివాహ బంధానికి ఎండ్ కార్డు పెట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు. ఎవరి జీవితంలో వారు బిజీగా మారిపోయారు. సామ్ మాత్రం చైతూతో గడిపిన క్షణాలను, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులను, తనను హార్ట్ చేసిన విషయాలను అంత ఈజీగా మర్చిపోవడం లేదని తెలుస్తోంది.

అందుకే సోషల్ మీడియా వేదిక ఒక్కోసారి ఒక్కో పోస్టు పెడుతూ తన ఆవేదనను వెల్లగక్కుతున్నట్టు తెలుస్తోంది. కొటేషన్స్‌తో పాటు సాడ్ పిక్స్ పోస్టు చేస్తున్నది. సామ్- చైకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. వీరు విడిపోయి రెండు నెలలు గడుస్తున్నా సోషల్ మీడియాలో నేటికీ వీళ్ళ గురించే డిస్కషన్ నడుస్తుంది. నిత్యం ఏదో విధంగా సామ్ చై గురించి వార్తలు వస్తున్నాయి.  వైరల్ కూడా అవుతున్నాయి. నెటిజన్లు కూడా సామ్ చై పర్సనల్ జీవితంపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారని అర్థమవుతోంది. వీరిద్దరి గురించి ఏ చిన్న వార్త వచ్చిన నెటిజన్స్ వెంటనే షేర్ చేస్తున్నారట..

Advertisement

తాజాగా సామ్ చేసిన పోస్టు సంచలనంగా మారింది. అందులో ఏముందంటే.. “లైఫ్‌లో తాను నేర్చుకున్న గుణపాఠం ఇదేన‌ని ఈ చెన్నై సుందరి ఓ కొటేష‌న్ పెట్టింది. ఇంకా తన జీవితంలో నేర్చుకోవాల్సినది చాలా ఉందని అందులో పేర్కొంది. ఈ మెసేజ్ మాత్రం నేరుగా అక్కినేని కుటుంబాన్ని టార్గెట్ చేసి సామ్ పోస్ట్ చేసిందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ కొటేషన్ తప్పుకుండా నాగచైతన్యకు తగులుతుందని నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.కాగా, సామ్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది.

Read Also : Actress Jayavani : క్యారెక్టర్ ఆరిస్టు ‘జయవాణి’ సంచలన కామెంట్స్.. ఆ ముగ్గురు దర్శకులు తనతో అలా ప్రవర్తించారట..!

Advertisement