RRR movie : దేశం మొత్తం ఎదురుచూస్తున్న క్రేజీ మల్టీస్టా్ర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి తర్కాణంగా విజువల్ ఫీస్ట్ తో అభిమానుల్ని ఆనందాశ్చర్యాలకు గురి చేసింది ట్రైలర్.
యంగ్ టైగర్ యన్టీఆర్ రౌద్ర తాండవం.. రామ్ చరణ్ వీర వీరంగం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీకి హైలైట్స్ గా నిలవబోతున్నాయి. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ అద్భుత అభినయం సినిమాపై భారీ అంచనాల్ని నెలకొల్పాయి. ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలు కాగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్, తమిళ నటుడు సముద్రఖని ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీయా, రాజీవ్ కనకాల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఓటీటీలో వచ్చేది ఎప్పుడు అన్న విషయంలో నిర్మాతలు అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు.
సాధారణంగా ఇప్పుడొచ్చే సినిమాలు ఒక నెలలోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ముందే అలా విడుదల చేసేందుకు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి ఓటీటీ సంస్థలు. అయితే ఆర్.ఆర్.ఆర్ మూవీ విషయంలో అలా జరగడం లేదు. విడుదలయ్యాకా ఖచ్చితంగా రెండు, మూడు నెలలు గ్యాప్ ఉండేలా డిజిటల్ రిలీజ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నారు మేకర్స్. అంటే థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుంచి 90 రోజుల తర్వాతే ఓటీటీలో ప్రిమియర్ అవుతుంది ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ. ప్రేక్షకులు చాలా రోజులు ఈసినిమా చూసి ఎంజాయ్ చేయాలని తాము భావిస్తున్నట్టు నిర్మాతలు చెప్పారు.
Tufan9 Telugu News providing All Categories of Content from all over world