...

RRR Movie : ఏడు రోజుల్లో రూ.710 కోట్లు.. ఆర్ఆర్ఆర్ తగ్గేదేలే కలెక్షన్లు..!

RRR Movie : టాలీవుడ్ సూపర్ డైరెక్టర్ జక్కన్న చెక్కిన అత్యద్భుత శిల్పమే ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే అందరినీ అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంది. మార్చి 25న విడుదలైన ఆర్ఆర్ఆర్ మూవీ. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. విడుదలై వారం అయినా ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గేదేలె అన్నట్లుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో మంచి వసూళ్లను సాధిస్తోంది.

Advertisement

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ రూ.710 కోట్ల గ్రాస్ సాధించింది. కేవలం హిందీలోనే రూ.132 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి వారంతంలో సినిమా ప్రతి చోట హౌస్ ఫుల్ తో నడిచింది. పని దినాల్లో కొంత కలెక్షన్లు తగ్గినా.. పండగ రావడం ఆ వెంటనే శని, ఆదివారాలు ఉండటంతో మరిన్ని కలెక్షన్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాను రూ.451 కోట్లకు అమ్మగా… రూ. 453 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే మొదటి వారంలో రూ. 392 కోట్ల షేర కొల్లగొట్టింది. మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా రూ.60.15 కోట్ల షేర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ ఈ వీకెండ్ లో కాస్త జోరు చూపెట్టినా బ్రేక ఈవెన ను దాటి… లాభాల బాట పడుతుంది.

Advertisement

Read Also : RRR Movie : ఏడు రోజుల్లో రూ.710 కోట్లు.. ఆర్ఆర్ఆర్ తగ్గేదేలె కలెక్షన్లు..

Advertisement
Advertisement