...

Guppedantha Manasu: గౌతమ్ లవ్ కు అడ్డువస్తున్న రిషి.. ఇదంతా వసు కోసమేనా!

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వసుధార తన జీవితంలో వచ్చిన మొదటి ప్రేమలేఖ అని.. మీరు అంటే నాకు ఇష్టం.. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఆ లేఖలో రాసినప్పుడు.. ఎవరు రాశారో ఆ వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా సర్ అంటూ రిషి తో చెప్పుకుంటుంది. ఎలాగైనా ఆ వ్యక్తి ఎవరో రిషిని తెలుసుకొండి అని అంటుంది.

ఆ తర్వాత కాలేజ్ లో రిషి, వసులు ఒక వైపు నుంచి వస్తూ ఉండగా.. వాళ్లకు ఎదురుగా మహేంద్ర, జగతిలు వస్తుంటారు. అలాగే ఈ రెండు జంటలు ఎదురు పడతాయి. జగతి వసుకు లవ్ లెటర్ రాసిన వ్యక్తిని ఇంకా తెలుసుకునేందుకు మహేంద్ర పై కోపడుతుంది. దానికి వసు ఈ విషయంపై నేను రిషి సర్ కలిసి డిసిషన్ తీసుకుంటాం మేడం ప్లీజ్ ఇక్కడితో ఈ టాపిక్ గురించి వదిలేయండి అని అంటుంది. ఆ తర్వాత రిషి గౌతమ్ ను ఒక గదిలోకి తీసుకుని వెళ్లి లెటర్ లో వసుధార పేరు మెన్షన్ చేసినందుకు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు.

ఇక్కడితో ఇవన్నీ స్టాప్ చేయ్ అని రిషి చెబుతాడు. దానికి గౌతమ్ ఆ మాటలు పట్టించుకోకుండా.. నువ్వు వద్దంటే నేను ఆపేస్తానా నా ప్రయత్నాలు నేను చేసుకుంటాను.. నా ప్రేమ నేను గెలిపించుకుంటాను.. అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత గౌతమ్ వసుధార పనిచేసే రెస్టారెంట్ కు వెళ్లి ఎక్కడుంది నా ఏంజెల్ అంటూ వెతుకుతూ వసుధార దగ్గరికి వెళ్తాడు. కాఫీ ఆర్డర్ చేయండి సార్ అని వసుధరా చెప్పగా లేదు నీతో కబుర్లు మాట్లాడడానికి వచ్చాను అని చెబుతాడు.

దానికి వసు, నాకు ఇప్పుడు ఇలాంటివి కుదరవు సర్ అని ఇగ్నోర్ చేస్తుంది. ఈలోపు రిషి కూడా రెస్టారెంట్ కి వస్తాడు. రిషిను చూసిన గౌతమ్ వీడు ఏంట్రా బాబు.. అన్నట్టు మనసులో ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వసు మీ ఇద్దరికి కాఫీ తీసుకు రావాలా సర్ అని అడగగా నాకు కాఫి వద్దు కాఫీ విత్ హార్ట్ అని అడుగుతాడు. దానికి ఇద్దరూ స్టన్ అవుతారు. ఆ తర్వాత ఈ మాటను గౌతమ్ కవర్ చేసుకుంటాడు. ఇక రిషికి కాఫీ మాత్రం వసుధార తీసుకొని వస్తుంది. ఇక గౌతమ్ కు కాఫీ ను వేరే సర్వర్ తో పంపిస్తుంది. మొత్తానికి గౌతమ్ లవ్ కు రిషి బాగా అడ్డు వస్తున్నాడు.