Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు తన బొమ్మను చూస్తూ ఆ బొమ్మను గీసిన వ్యక్తి గురించి రిషి దగ్గర పొగుడుతూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసు, రిషి తో మాట్లాడుతూ నాకు ఎందుకో ఈ బొమ్మ గీసిన వ్యక్తి ఎవరో మీకు తెలిసి కూడా నాకు చెప్పలేదు అని అనిపిస్తోంది సార్ అని అనడంతో, మరి ఈ బొమ్మ గీసిన అజ్ఞాతవాసి ఎవరో కనిపెట్టు ఇది నీకు ఒక గోల్ లాంటిది అని అంటాడు రిషి.
ఆ తర్వాత వసు, రిషి ఇద్దరూ మాట్లాడుకుంటూ కారులో వెళుతుండగా ఇంతలో రిషి అసలు విషయాన్ని బయట పెట్టేసినట్లు ఊహించుకుంటాడు. ఆ తర్వాత వసు కోసం కొన్న మల్లెపూలను ఇస్తాడు. ఆ మల్లెపూలను చూసిన వసుధార ఎంతో ఆనంద పడుతుంది.
వసు మల్లెపూలు తీసుకున్నందుకు రిషి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ తరువాత ఇంటికి వెళ్లిన వసు ఆ అజ్ఞాత వ్యక్తి రిషి సార్ అయ్యిఉండకూడదు అని అనుకుంటుందీ. మరొకవైపు రిషి కూడా ఇంట్లో కూర్చొని వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత రిషి ఇచ్చిన మల్లెపూలు లవ్ షేప్ లో పెట్టి రిషి కి వాట్స్అప్ చేస్తుంది.
అజ్ఞాత కళాకారుడికి ఒక చిన్న గిఫ్ట్ వీలైతే తన కి పంపించండి సార్ అని చెప్తుంది. మరొకవైపు రిషి, జగతి మాట్లాడుతూ వసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన సాక్షి సినిమా కి వెళ్దాం పదా అని అడగగా, అప్పుడు రిషి కోప్పడతాడు.
అంతేకాకుండా పర్మిషన్ లేకుండా ఎందుకు కాలేజీ లోకి వచ్చావు అంటూ తిడతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా రిషి, వసు ల ఈ విషయాన్ని సాక్షి అందరి ముందు బయట పెట్టేస్తుంది. ఇంతలో అక్కడికి వసు వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World