Anchor Anasuya: 50 ఏళ్ళు వచ్చిన అనసూయ కత్తిలా ఉంటుందనుకోండి… అసలు వయసెంతో బయటపెట్టిన అనసూయ?

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని విశేషమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న అనసూయ వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె ఆరేడు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై పలు కార్యక్రమాలు పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అనసూయ తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.మే 15వ తేదీ పుట్టిన రోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే అనసూయ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించి అప్డేట్ విడుదల చేయడం అలాగే కొత్త సినిమాలకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటికే అనసూయ మెగాస్టార్ గాడ్ ఫాదర్, కృష్ణవంశీ రంగమార్తాండ, పుష్ప 2, పక్కా కమర్షియల్ వంటి సినిమాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇదే కాకుండా మలయాళంలో మమ్ముట్టితో కలిసి భీష్మపర్వం అనే సినిమాలో నటించారు.

Advertisement

వీటితో పాటు కొత్తగా నటిస్తున్నటువంటి సింబా,వాంటెడ్‌ పండుగాడ్‌ సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ అనసూయకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే లేటెస్ట్ `ది సూపర్‌ ఫ్యామిలీ` షోలో కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు.యాంకర్ ప్రదీప్ అనసూయని ప్రశ్నిస్తూ తన గురించి గూగూల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన కొన్ని ప్రశ్నలు గురించి అడిగారు. ఇందులో మొదటి ప్రశ్న అనసూయ ఫోన్ నెంబర్ మొదటి స్థానంలో ఉండగా, అనసూయ వయసు ఎంత రెండవ స్థానంలో, ఇక మూడవ స్థానంలో అనసూయ ఇంటి అడ్రస్ గురించి సెర్చ్ చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మీ వయసెంత అంటూ ప్రదీప్ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకి అనసూయ సమాధానం చెబుతూ 50 సంవత్సరాలు వచ్చిన అనసూయ కత్తిలా ఉంటుందని కోరుకోండి అంటూ సమాధానం చెప్పారు. ఈ విధంగా అనసూయ తన వయసు గురించి బోల్డ్ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇకపోతే తనకు ఈ ప్రశ్న ఎదురైంది కనుక ఈమె తన అసలు వయసు ఎంతో కూడా బయటపెట్టారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ తాను ఇప్పటికీ 37 సంవత్సరాలు పూర్తి చేసుకుని 38వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.

Advertisement