మాస్ మహారాజ్ రవితేజ.. సినిమాల విషయంలో చాలా స్పీడ్‌గా ఉన్నాడు. ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ.. మరికొన్ని కథలను వినడానికి కూడా వెనకాడట్లేదు. ఈ నాలుగు సినిమా షూటింగ్స్‌ను కూడా ఒకటి తర్వాత ఒకటిగా మ్యానేజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా మాస్ మహారాజ్.. మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ సినిమాలో తాను ఏకంగా అయిదుగురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు.
అంతకు ముందు ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటించిన రవితేజ.. ఆ తర్వాత రూటు మార్చాడు. డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. మధ్యమధ్యలో కమర్షియల్ సినిమాలు చేసినా కూడా ఎక్కువగా ప్రయోగాత్మక కథల వైపు కూడా మొగ్గుచూపుతున్నాడు. అలా రవితేజ నటిస్తున్న చిత్రమే ‘రావణాసుర’. ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుండి క్యాస్ట్ వరకు అన్ని అంశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రియేటివ్ క్రైమ్ కథలకు పెట్టింది పేరు. అలాంటి సుధీర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న చిత్రమే ‘రావణాసుర’. ఈ సినిమాకు క్యాప్షన్ హీరోలు అనేవారు లేరు. ఇందులో ఓ కీలక పాత్రలో హీరో సుశాంత్ నటిస్తున్నాడు. ఈ క్యాప్షన్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాలో రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు.
తాజాగా రావణాసుర షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది.
భోగీ సందర్భంగా రావణాసుర సినిమా షూటింగ్‌ను అధికారికంగా లాంచ్ చేసింది మూవీ టీమ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. అయితే అప్పుడే ఈ సినిమాలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా అయిదుగురు హీరోయిన్లు అని క్లారిటీ వచ్చింది. రావణాసురలో అనూ ఇమాన్యుయల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌తో పాటు తెలుగమ్మాయి పూజితా పొన్నాడ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
IRCTC Down : ప్రముఖ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)సైట్, యాప్ గురువారం (డిసెంబర్ 26)…
ICAI CA Final Result 2024 : ICAI CA ఫైనల్ రిజల్ట్స్ నవంబర్ 2024 లైవ్ అప్డేట్స్ :…
Earthquake AP : ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భూమి కంపించింది. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూమి ఒక్కసారి…
Earthquake Nepal : మన పొరుగు దేశం నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేపాల్‌లో శనివారం ఉదయం 4.8 తీవ్రతతో…
Is Bank Open Today : ఈరోజు బ్యాంకులకు హాలిడే ఉందో లేదో తెలియదా? వారాంతాల్లో ఆర్థిక లావాదేవీలను పూర్తి…
Om Prakash Chautala : హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా ఇకలేరు. ఇండియన్ నేషనల్ లోక్ దళ్…
This website uses cookies.