...

Rakul Chhatriwali : రకుల్ చేసిన పనికి ఆమె పేరంట్స్ షాక్.. కండోమ్‌ టెస్టర్‌గా బోల్డ్ రోల్..!

Rakul Chhatriwali : అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. గ్లామర్ రోల్స్ చేస్తూ దూసుకెళ్తోంది. బోల్డ్ రోల్స్ కూడా చేస్తానంటూ ముందుకొచ్చి ఏమాత్రం ఆలోచించకుండా బోల్డ రోల్స్ చేసేందుకు ఓకే చెప్నేస్తోంది. రకుల్ నటించిన కొత్త మూవీలో ఆమె బోల్డ్ రోల్ చేయనుంది. అందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ కనిపించనుంది. ఈ మూవీ చేస్తానని రకుల్ చెప్పినట్టు ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారట.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల రియాక్షన్ గురించి బయటపెట్టింది పంజాబ్ బ్యూటీ..

Advertisement

ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఇదేమీ కొత్తది కాదని, ఎన్నాళ్ల నుంచో మన సమాజంలో ఉన్నదేనంటూ చెప్పుకొచ్చింది. ఒక కుటుంబ కథా చిత్రంగా అందరికి చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపింది. ఒక సాధారణ అమ్మాయిగా వచ్చిన రకుల్.. కండోమ్ టెస్టర్ గా మారుతుంది. నెలజీతం కోసం ఉద్యోగంలో చేరిన రకుల్.. ఆ పాత్రలో తనదైన నటనతో మెప్పించే అమ్మాయి పాత్ర నాది అంటోంది. అందరికి తెలిసిందే.. మనము ఎలా పుడతాము అనేది.. అయితే అందరూ ఆ విషయంపై మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు.

Advertisement
Rakul Chhatriwali : Actress Rakul Preet Singh Shares parents Reaction to her playing condom tester in Chhatriwali Movie
Rakul Chhatriwali : Actress Rakul Preet Singh Shares parents Reaction to her playing condom tester in Chhatriwali Movie

సిగ్గుపడతారు.. మొహమాటపడతారు.. ఏది చేయాలి.. ఏది చేయకూడాదో అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని రకుల్ చెప్పుకొచ్చింది. ఈ డిఫరెంట రోల్ చేయడానికి అందుకే ఒప్పుకున్నానని అంటోంది. ఈ సినిమా రోల్ ఎలా ఉంటుందో ముందుగానే తన తల్లిదండ్రులకు చెప్పినట్టు తెలిపింది.

Advertisement

అయితే తన తల్లిదండ్రులు అందరిలా వద్దని చెప్పకుండా వెంటనే ఓకే చెప్పేశారని, తనను మరింత ప్రోత్సహించారని తెలిపింది. అంతేకాదు. తాను చేయబోయే ప్రతి సినిమాను ముందుగానే తన తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటానని అంటోంది. వారు ఓకే చెబితే వెంటనే ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తానని రకుల్ అంటోంది.

Advertisement

Read Also : Anchor Ravi – Rashmi: తెల్లవార్లు యాంకర్ రష్మీతో కలిసి రవి కష్టాలు మామూలుగా లేవుగా… అంతా దానికోసమే!

Advertisement
Advertisement