Puri Trolling : పూరీ.. పూరీ.. పూరీ.. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే పూరీ జగన్నాథ్ ప్రస్తావన లేని పోస్టులు ఉండట్లేదు. అన్నింటిలో పూరీ జగన్నాథ్ ను ట్రోల్ చేసేవి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో పూరీపై ట్రోలింగ్ స్టార్ట్ అయిది. లైగర్ మూవీకి డైరెక్షన్ చేసింది పూరీ జగన్నాథ్ కాదని, ఛార్మీ చేసి పూరీ పేరు వేశారని పలు పోస్టులు కనిపిస్తున్నాయి. పూరీ డైరెక్షన్ మరీ ఇంత వీక్ అయిందా అని మరికొందరు అంటున్నారు. ఒక పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన పూరీనేనా లైగర్ తీసిందని విమర్శిస్తున్నారు.
అయితే లైగర్ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ.. విజయ్ దేవరకొండ నటనను, తాను పడిన కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. తన పరిధిలో అద్భుతంగా నటించాడని అంటున్నారు. రమ్యకృష్ణ కూడా మంచి పవర్ ఫుల్ పాత్రలో మైమరిపించిందని చెబుతున్నారు. తీరా, డైరెక్షన్ ప్రస్తావన వచ్చేసరికి పూరీని విమర్శించకుండా ఉండలేం అనేది విమర్శకుల మాట. మరీ ఇంత పేలవంగా ఎలా తీశాడని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. డైలాగులతో అల్లాడించే పూరీ.. ఇలాంటి క్యారెక్టర్ ను ఎలా రాసుకున్నాడని ప్రశ్నిస్తున్నారు.
లైగర్ సినిమాతో పూరీపై పర్సనల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు చాలా మంది. ఛార్మీతో తెగదెంపులు చేసుకుంటేనే బాగు పడతావని హితబోధ చేస్తున్నారు.
ఈ ట్రోలింగ్ పై పూరీ జగన్నాథ్ భార్య లావణ్య మాట్లాడినట్లు తెలుస్తోంది. మా ఆయన గురించి నాకు తెలుసని, ఆయన సత్తా, స్టామినా ఏంటో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసని, ప్రస్తుతం టైం బాగా లేకపోవచ్చు. కానీ మళ్లీ పాత పూరీని చూస్తారని, అందరూ గర్వపడేలా చేస్తారన్న నమ్మకం తనకు ఉందని లావణ్య అన్నట్లు తెలుస్తోంది.