...

Prabhas: ఆ కారణం వల్ల కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రభాస్!

Prabhas:పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటించిన రాధేశ్యామ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మార్చి 11వ తేదీ విడుదల కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

రాధేశ్యామ్ సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ… ప్రేమ కథ చిత్రంగా వస్తున్నటువంటి ఈ సినిమాలో ఎన్నో రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి అయితే ఈ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించారు. ఇకతన తదుపరి చిత్రాల గురించి కూడా ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడారు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం తన కలఅని, ఈ సందర్భంగా ఆ కల ప్రాజెక్ట్ కే ద్వారా నెరవేరిందని ప్రభాస్ తెలియజేశారు. ఇకపోతే తను తన జీవితంలో కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

అసలు ప్రభాస్ కోట్లరూపాయలను పోగొట్టుకోవడానికిగల కారణం ఏమిటి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తాను తన జీవితంలో ఎప్పుడు సెటిల్‌గా ఉంటానని అందుకే తన కెరీర్లో చేయాల్సిన చాలా సినిమాలను వదులుకున్నానని అలా తన జీవితంలో కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నానని ఈ సందర్భంగా ప్రభాస్ ఈ ఇంటర్వ్యూ ఈ సందర్భంగా వెల్లడించారు. అందుకే ప్రస్తుతం వరుస బ్యాక్ బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నానని ఈ ఏడాది వచ్చే ఏడాది తన సినిమా విడుదల అవుతాయని తెలియజేశారు.