...

Andhra News: బస్సు నడుపుతూ గుండెపోటుతో మృతి చెందిన డ్రైవర్… త్రుటిలో తప్పిన ప్రమాదం!

Andhra News: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో 69 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు నడుపుతున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన డ్రైవర్ సీట్లోనే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు బస్సును అదుపులో వుంచి అందరి ప్రాణాలను కాపాడారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆగరాల వద్ద చోటుచేసుకుంది. మదనపల్లి-2 డిపో పల్లెవెలుగు బస్సు ఈరోజు ఉదయం 10 గంటలకు
తిరుపతి నుంచి మదనపల్లికి వయా పుంగనూరు మీదుగా ప్రయాణికులతో బయలుదేరింది. అయితే చంద్రగిరి దాటగానే డ్రైవర్ రవికి తీవ్రమైన గుండెపోటు రావడంతో డ్రైవర్ సీటులోనే మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు వెంటనే అప్రమత్తమై తన తెలివితేటలతో బస్సు ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బస్సును నిలిపివేశాడు.

సరైన సమయానికి ప్రయాణికుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది లేదంటే బస్సులో ఉన్నటువంటి 60 మంది ప్రయాణికులు ప్రాణాలు తీవ్రమైన ఇబ్బందుల్లో పడేవి. ఇక సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవర్‌ మదనపల్లి డిపోకు చెందిన రవిగా పోలీసులు గుర్తించారు.