Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో స్వప్న తన ఆటో తగలబెట్టినందుకు జ్వాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో నిరూపమ్, హిమ జ్వాలా కోసం కొత్త ఆటో ని తీసుకొని వస్తారు. అప్పుడు జ్వాలా ఏంటి డాక్టర్ సాబ్ ఇలా వచ్చారు అని అడగగా అప్పుడు నిరూపమ్ ఆటో కీస్ ని జ్వాలా చేతిలోపెట్టి ఇకపై ఈ ఆటో నీదే అని అంటాడు. అప్పుడు జ్వాలా ఎంతో ఆనంద పడుతుంది.
ఇంతలో అక్కడికి వచ్చిన చంద్రమ్మ దంపతులు నిరూపమ్, హిమ ను పొగుడుతూ ఉంటారు. జ్వాలా,ప్రేమ తో హిమ ను హగ్ చేసుకుంటుంది. ఆ తరువాత జ్వాలా,నిరూపమ్, హిమ కు పార్టీ ఇస్తాను అని చెప్పి రెస్టారెంట్ కీ తీసుకొని వెళ్తుంది. అక్కడ వాళ్ళను చుసిన ప్రేమ్ ఆశ్చర్యపోతాడు.
ఆ తరువాత ప్రేమ్ కూడా వెళ్లి వారితో జాయిన్ అవుతాడు. ఇక ప్రేమ్ ని జ్వాలా కొద్దిసేపు ఆట పట్టిస్తుంది. ప్రేమ్ ప్లేట్ లో ఉన్న చికెన్ పీస్ ని జ్వాలా తీసుకొని ఆట పట్టిస్తుంది. అప్పుడు ప్రేమ్ నీకు అక్క చెల్లి తమ్ముడు ఎవరూ లేరా అని జ్వాలా ని అడగగా,అప్పుడు జ్వాలా ఎవరు లేరు అని చెబుతుంది.
ఇంతలో జ్వాలా,ప్రేమ్ ను మళ్ళీ ఎక్సట్రా అంటు ఆట పట్టిస్తుంది. అది చూసిన హిమ,నిరూపమ్ లు నవ్వుకుంటూ ఉంటారు. మరొకవైపు సౌందర్య,హిమ రూమ్ లో లైట్స్ అన్ని ఆన్ లో ఉండటంతో అక్కడికి వెళ్తుంది. పట్టపగలే రూమ్ లో లైట్ ని ఆన్ చేసి హిమ ఎక్కడికి వెళ్ళింది సౌందర్య వెతుకుతూ ఉంటుంది. హిమ రూమ్ లో సౌర్య,హిమ కలిసి దిగిన ఫోటోని చూడడానికి వెళుతుంది సౌందర్య. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.