Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన భర్త విగ్నేష్ తో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి వివాహం తర్వాత పలు ఆలయాలను సందర్శించిన ఈ జంట ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి హనీమూన్ కోసం ఈ జంట థాయిలాండ్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. వీరి హనీమూన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని ఫోటోలను విగ్నేష్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా ఎంతోమంది అభిమానులు ఎంజాయ్ అంటూ కామెంట్లు చేశారు. అదేవిధంగా తాజాగా విగ్నేష్ నయనతార ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో బ్లాక్ డ్రెస్ ధరించిన నయనతార పసుపుతాడు మెడలో వేసుకోవడంతో చూడముచ్చటగా ఉన్నారు. అలాగే చేతికి పెళ్లిలో కట్టిన పసుపు తాడు ఉండడంతో ఈమెలో పెళ్లి కల కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
ఇకపోతే నయనతార ఈ ఫోటోని షేర్ చేస్తూ విగ్నేష్ ఫుడ్ కోసం వెయిటింగ్ అంటూ క్యాప్షన్ పెట్టారు.ఈ విధంగా నయనతార హనీమూన్ లో ఫుడ్ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి ఈ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడిన నయనతార ఇకపై సినిమాలలో నటిస్తారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ నటించిన ఈమె గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
Read Also : Vignesh-nayan wedding : ఒక్కటైన నయన్, విఘ్నేష్ లు.. నెట్టింట వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!
Tufan9 Telugu News And Updates Breaking News All over World